Insurance: ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెబుతుంటారు. ఆరోగ్యం ఒక్కటి ఉంటే డబ్బులతో కూడా ఎక్కువ అవసరం ఉండదు. డబ్బుల్ని ఎంతలా కాపాడుకుంటామో ఆరోగ్యాన్ని అంతకంటే ఎక్కువగా కాపాడుకోవాలని పెద్దలు పదేపదే చెబుతుంటారు.. ఈ రోజుల్లో ఎవరికి ఏ అనారోగ్య సమస్య వస్తుందో కూడా చెప్పలేం.. ఎందుకంటే మనం తింటున్న ఆహారం అలాంటిది.. ఈరోజుల్లో ఏదైనా అనారోగ్యానికి గురై ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి వెళితే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి.. అయితే కొంతమంది ఆరోగ్య భీమా ద్వారా చికిత్స పొందుతారు.. ఈ ఆరోగ్య బీమా కావాలంటే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది… అయితే ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఐదు లక్షల వరకు ఉచితంగా ట్రీట్మెంట్ పొందచ్చని మనలో కొద్దిమందికి మాత్రమే తెలుసు.. ఇందుకోసం ప్రీమియం కట్టాల్సిన పని లేదు..

ఈ పథకంను ఆయుష్మాన్ భారత్ యోజన పేరును ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ముఖ్యమంత్రి పథకం కింద మార్చారు. ఈ పథకం కింద అర్హులైన వారికి ఆయుష్మాన్ కార్డు జారీ చేస్తారు. 5 లక్షల వరకు ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే ఈ పథకంలో ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పథకానికి మీరు కూడా అర్హులో కాదో ఈ విధంగా చెక్ చేసుకోవాలి..
ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఉచితంగా చికిత్స పొందాలనుకుంటే.. ముందుగా మీరు ఈ పథకానికి అర్హులు కాదో తెలుసుకోవాలి.
ఆ అర్హత తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైటు pmjay.gov.in ను సందర్శించాలి.
వెబ్సైట్లోకి వెళ్లిన తరువాత పైన యాం ఐ ఎలిజిబుల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
ఆ తరువాత మీ మొబైల్ నెంబర్లు ఎంటర్ చేసి వచ్చిన ఓటీపీని మళ్లీ అక్కడే ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.. మీ రాష్ట్రాన్ని ఎంచుకోవడంతో పాటు మీ మొబైల్, రేషన్ కార్డు నెంబర్స్ ని కూడా ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.
ఇలా మీ వివరాలు ఎంటర్ చేయగానే మీరు అర్హులు కాదో తెలుస్తుంది.