బాధ , సంతోషం అనేవి ఎవ్వరికైనా ఒకటే .అయితే వాటిని అమ్మాయిలు ఒక విధం గా అబ్బాయిలు ఇంకో విధం గా వ్యక్త పరుస్తూ ఉంటారు.అమ్మాయిలకు, అబ్బాయిలకు చాలా విషయాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ముఖ్యంగా ఎమోషన్స్ విషయంలో..అమ్మాయిలు చిన్న చిన్నవిషయాలకే చాల సంతోష పడిపోతూ ఉంటారు. చిన్న బాధ వచ్చినాఅస్సలు తట్టుకోలేరు వెంటనే బోరుమని ఏడ్చేస్తారు.
కోపం చూపించేస్తారు, అలుగుతూ ఉంటారు. కానీ అబ్బాయిలు అలా కాదు. ఎవరో కొందరు మాత్రమే ఎమోషనల్ గా ఫీలౌతారు. కానీ.. దాదాపు అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకు ఎమోషన్స్ చాలా తక్కువనే చెప్పాలి. వాళ్లు బాధ వచ్చినా.. సంతోషం వచ్చినా తొందరగా ,బయటపడరు. దీనికి సైంటిఫికల్ గా కారణం ఉందటున్నారు నిపుణులు.అబ్బాయిల బ్రెయిన్ స్ట్రక్చర్ అమ్మాయిల బ్రెయిన్ తో పోలిస్తే డిఫరెంట్ గా ఉంటుందట. ఈ విషయంపై స్విడ్జర్లాండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ బసేల్ సైకియాట్రిక్ హాస్పిటల్ కి చెందిన పరిశోధకులు జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడయ్యింది.
పలువురు అమ్మాయిలు, అబ్బాయిల పై పరిశోధనలు జరిపినట్లు తెలిపారు. కొందరు మినహాయించి చాలా మంది అబ్బాయిల బ్రెయిన్ స్ట్రక్చర్, ఫంక్షనింగ్ డిఫరెంట్ గా ఉండడం వారు గమనించారు. అందుకే వారు ఎమోనల్ గా పెద్దగా కనెక్ట్ అవ్వరని నిపుణులు చెబుతున్నారు. ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకునే శక్తి వారి బ్రెయిన్ కి ఉంటుందట. అందుకే వారి బిహేవియర్ డిఫరెంట్ గా ఉండడంవలన అబ్బాయిలు ఎంత భాధ వచ్చినా తొందరగా ఏడవకుండా తట్టుకుని స్ట్రాంగ్ గా నిలబడడానికి అసలు కారణమిదే అని తెలియచేసారు నిపుణులు..