NewsOrbit
హెల్త్

బ్రెస్ట్ కాన్సర్‌తో గుండెకు లింక్!

బ్రెస్ట్ కాన్సర్ వచ్చిన మహిళలకు ఆ తర్వాత గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువని ఒక అధ్యయనంలో తేలింది. ఈ ప్రమాదం 45 ఏళ్లు ఆపైన వయసు గల మహిళలకు ఎక్కువ.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మహిళలకు వచ్చే కాన్సర్‌ రకాలలో ఎక్కువ మందికి సోకేది బ్రెస్ట్ కాన్సర్. అయితే ఇది సులభంగా తగ్గే కాన్సర్ కూడా. బ్రెస్ట్ కాన్సర్ సోకిన తెల్లజాతి మహిళలలో 91 శాతం, అదే ఇతర రంగు జాతుల మహిళలయితే 78 శాతం కనీసం అయిదేళ్ల పాటు జీవిస్తారు. ఉండేకొద్దీ బ్రెస్ట్ కాన్సర్ సోకిన  మహిళల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి కూడా.

అయితే బ్రెస్ట్ కాన్సర్‌కు చికిత్స పొందిన  మహిళలు ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సివస్తున్నది. ఎముకలు క్షీణించడం, ముందుగా మెనోపాజ్ రావడం, గుండె బలహీనం కావడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. 45 ఏళ్లు పైబడిన మహిళలు బ్రెస్ట్ కాన్సర్ ట్రీట్‌మెంట్ తీసుకున్న తర్వాత వారికి గుండె రక్తనాళాల జబ్బు వచ్చే అవకాశం ఎక్కువని బ్రెజిల్‌లో జరిగిన ఒక అధ్యయనం తేల్చింది.

సావోపాలోలోని పాలిస్టా స్టేట్ యూనివర్సిటీ, బొటుకాటు మెడికల్ స్కూల్‌లో ఈ అధ్యయనం నిర్వహించారు. 45 ఏళ్లు పైబడిన ఆరోగ్యవంతులతో పోల్చుకుంటే బ్రెస్ట్ కాన్సర్ ట్రీట్‌మెంట్ పొందిన వారిలో మెటబాలిక్ సిండ్రోమ్, మధుమేహం, అథెరోస్క్లెరోసిస్, రక్తంలో ఫాటీ గ్లిజరాయిడ్లు పెరగడం వంటి లక్షణాలు ఎక్కువగా కనబడ్డాయి. ఇవన్నీ కూడా గుండె జబ్బుకు దారి తీసే లక్షణాలే. ఉండేకొద్దీ ప్రపంచంలో బ్రెస్ట్ కాన్సర్ సోకేవారి సంఖ్య పెరుగుతోంది. బ్రెస్ట్ కాన్సర్‌కు ట్రీట్‌మెంట్ తీసుకున్న మహిళలు గుండెను ఆరోగ్యవంతంగా ఉంచే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం సూచిస్తున్నది.

Disclaimer: This content and media is created and published online for informational purposes only. It is not intended to be a substitute for professional medical advice and should not be relied on as health or personal advice.

author avatar
Siva Prasad

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri

Leave a Comment