NewsOrbit
హెల్త్

పిల్లలు పుట్టిన తరవాత పాల విషయం లో ఆడవారు ఇబ్బంది పడుతూ ఉంటారు .. వారికి ఇదే బెస్ట్ ఐడియా !

పిల్లలు పుట్టిన తరవాత పాల విషయం లో ఆడవారు ఇబ్బంది పడుతూ ఉంటారు .. వారికి ఇదే బెస్ట్ ఐడియా !

బిడ్డకు పాలు సరిపోవడం లేదని చాలామంది తల్లులు తమలో తామే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. బిడ్డకు తల్లి నుండి 6 నెలలు పాలు ఖచ్చితంగా అవసరం తల్లి బిడ్డకి జన్మనిచ్చాక  చనుపాలు పట్టాలి. పొత్తిళ్లలో ఉన్న బిడ్డకు మొదటి ఆహారం అమ్మ పాలే.

పిల్లలు పుట్టిన తరవాత పాల విషయం లో ఆడవారు ఇబ్బంది పడుతూ ఉంటారు .. వారికి ఇదే బెస్ట్ ఐడియా !

అయితే కొంతమంది స్త్రీలలో పాల ఉత్పత్తి అనేది సరిగా జరగదు. అందువల్ల బిడ్డకు సరిగ్గా పాలు ఇవ్వలేరు. ఫలితముగా ఫార్ములా మిల్క్, ఆవుపాలు పట్టడం లాంటివి చేస్తారు. ఒక్కోసారి ఆ పాలు పడక వాంతులు, విరోచనాలు అవుతాయి. అయితే ఈ కింద చెప్పిన ఆహార పదార్ధాలు తినడం వల్ల పాలు ఉత్పత్తి బాగా ఉంటుంది. మెంతులూ, మెంతి కూర బాలింతలకి మేలు చేస్తాయి. ఇందులో ఉండే ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్స్, మినరల్స్ తల్లికీ బిడ్డకీ కూడా మంచివి. పప్పుల్లో, కూరల్లో కొంచెం మెంతి పొడి వేసుకోవచ్చు. మెంతి కూరతో పప్పు చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. అయితే డయాబెటిక్ పేషెంట్స్, పీనట్ ఎలర్జీ ఉన్నవారు మెంతులు, మెంతి కూర తీసుకోకూడదు. అలాగే, ఇవి ప్రెగ్నెన్సీ టైం లో తీసుకోడం మంచిది కాదు. సోంపుప్రతి రోజూ  ఒక గుప్పెడు తీసుకోవడం వలన పాలు బాగా పట్టేలా చేయగలదు.

బాలింతలకు బొప్పాయి కల్పతరువులాంటిది. బొప్పాయి, బొప్పాయికాయ దోరగా ఉన్నదాన్ని కొబ్బరి కోరులా చేసి కూరవండుకుని తిన్నట్లయితే స్తన్యవృద్ధి కలుగుతుంది. తన పాలు దోషయుక్తంగా ఉండి బిడ్డకు వికారం, విరేచనాలు కల్గిస్తున్నప్పుడు, బొప్పాయి కాయనుగానీ పండునిగానీ తీసుకోవడం మంచిది. పాల ఉత్పత్తిని పెంచేందుకు మరిన్ని మార్గాలున్నాయి. ఆవుపాలు, కర్బూజాపండు, పాలకూర, జీలకర్ర. బార్లీజావ, బొబ్బర్లు, తెలకపిండితో చేసిన కూర, ములగాకు కూరలు చాలా మేలు చేస్తాయి
ఆముదం ఆకులపైన ఆముదాన్ని రాసి వెచ్చ చేసి రొమ్ములకు కడితే పాలచేపు వస్తుంది.బాలింతలకు వాము కషాయం రోజూ తేనెతో తీసుకుంటే చక్కని పాలు పడతాయి.

గుడ్లు టేస్టీ గా ఉంటాయి.అలాగే పోషకపదార్ధాలు కూడా ఎక్కువగా ఉంటాయి గుడ్డులో.  వీటిలో ప్రొటీన్, విటమిన్ బీ12, విటమిన్ డీ, రైబోఫ్లావిన్, ఫోలేట్, కోలీన్ ఉంటాయి. కోలీన్ చిన్న పిల్లల్లో మెదడు పెరుగుదలకు  బాగా హెల్ప్ చేస్తుంది. వీటిని బాయిల్ చేసి తీసుకోవచ్చు, స్క్రాంబుల్ చెయ్యచ్చు, ఆమ్లెట్, సలాడ్…ఎలాగైనా తినచ్చు.ప్రెగ్నెన్సీ టైం లో బిడ్డకి పాలిస్తున్నప్పుడూ కూడా తల్లికి విటమిన్ ఏ ఫుడ్స్ చాలా అవసరం. క్యారెట్స్ లో ఉన్న బీటా కెరొటిన్ వల్ల విటమిన్ ఏ లోపం లేకుండా ఉంటుంది. క్యారెట్ సూప్, క్యారెట్ సలాడ్ , లేదా క్యారెట్ జ్యూస్, క్యారెట్ కూర…అన్నీ మంచివే. ఎలాగైనా తీసుకోవచ్చు.

పాలకూరతో పాటూ మిగిలిన ఆకుకూరలు కూడా బాలింతలకి చాలా మంచిది. పాలకూర సిజేరియన్ ద్వారా బిడ్డని కన్న వారికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, బాలింతలు మాత్రం వండిన పాలకూరనే తినాలి. ప్రెగ్నెన్సీ టైమ్‌లో పెరిగిన బరువుని పోగొట్టుకోవడం వంటి ప్రయోజనాలు పాలిచ్చే తల్లులకి కలుగుతాయి . పైగా వీరికి బ్రెస్ట్ కాన్సర్, ఆర్థ్రైటిస్, గుండె జబ్బులు వచ్చే రిస్క్ కూడా బాగా తగ్గుతుంది. అంతే కాకుండా బిడ్డకి పాలివ్వడం వల్ల తల్లికీ బిడ్డకీ మధ్య ఒక చక్కని మానసిక బంధం ఏర్పడుతుంది.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri