Romance: వర్క్ బిజీ తో శృంగారానికి సమయం ఉండటం ఉండటం  లేదా ??అయితే  ఇలా చేసి చూడండి. (పార్ట్-2)

Share

Romance:  ప్రతి రోజు హడావిడిగా స్నానం ముగించి, ఆఫీసుకు బయలుదేరే టెన్షన్ ఉంటుంది. అయితే కుదిరినప్పుడు మాత్రం ఒంటరిగా స్నానం  చేయడం మానేయండి.అంటే వారం రోజుల పాటు ఆ అవకాశం ఉండకపోవచ్చు కానీ, వీక్  ఎండింగ్  లో  స్నానం చేసేటప్పుడు మీ భాగస్వామిని టవల్ తెమ్మని, సబ్బు తీసుకుని రమ్మని లేదా వీపు  రుద్దమని పిలిచి బాత్రూం లో ఇద్దరు కలిసి స్నానం చేయండి. ఒకరికి ఒకరు ఆయిల్ మసాజ్ చేసుకోవడం వలన శరీరానికి విశ్రాంతితో పాటు ఇలాంటి రొమాంటిక్  సీన్స్ జీవితాన్ని రసవత్తరం చేస్తాయి.

ఆఫీస్ కి  వెళ్లడానికి బట్టలు వేడుకునే  ముందు సెక్స్ లింగరీ మీ భాగస్వామి చూస్తుండగా వేసుకోండి .ఆడవారు  ఇలా చేయడం వలన అతనిలో కోరిక కలిగి  అంగం స్తంభిస్తే ఆ సమయాన్ని కూడా వాడుకోండి. మీ పనులు శృంగార  క్రీడ తో మొదలు పెడితే  రోజంతా ఎంత తాజాగా ఉత్సహం గా  ఉంటుందో , అనుభవిస్తే తెలుస్తుంది. అమ్మో అప్పుడు ఆఫీస్ కి టైం అయిపోదు అని అనుకోకండి.. ఏమైనా కూడా  అప్పుడప్పుడు  అలాంటివి చేసి చూడండి.


రాత్రి పనులన్నీ ముగించేసి ఎలాంటి టెన్షన్  లేకుండా ఇద్దరికీ నచ్చే సినిమాలు  కలిసి చూడండి. మీకు ఇష్టమైన సినిమా, లేదా ఏదైనా  ప్రోగ్రాం   టీవీ లో కానీ , కంప్యూటర్‌లోకానీ  చూస్తూ మెల్లగా  ఒకరిని ఒకరు హత్తుకుంటూ,స్పర్శించుకుంటూ  అలా తెలియకుండా శృంగారం లో  మునిగిపోయి  మంచి నిద్రలోకి జారుకోవచ్చు. ఇద్దరు  కలిసి మీకోసం  సమయాన్ని కేటాయించుకుని ఎంజాయ్  చేయడానికి చిన్న చిన్న ప్లాన్ లు వేసుకోండి..


Share

Related posts

బ్రేకింగ్ : కరోనా భయం పల్లెల్లో ఎంతగా ఉంది అంటే…!!

Srinivas Manem

కాశ్మీర్ లో హింస-ఏడుగురు మృతి

Siva Prasad

24000 ఖాతాల్లోకి .. మీరు లబ్దిదారులో కాదో ఇలా తెలుసుకోండి !

somaraju sharma