Romance: ఈ ఆధునిక కాలంలో భార్య భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే గానీ జీవితాలు గడవడం లేదు. ఈ క్రమం లో ఉద్యోగాలు చేస్తున్న వారు ఆఫీస్ లో పని ముగించుకుని ఇంటికి వచ్చే సరికి ఓపిక తగ్గి డీలాపడిపోతున్నారు. ఇది వారి శృంగార జీవితం దెబ్బతినేలా చేస్తుంది. ఈ పరిస్థితి లో రాత్రులు కేవలం నిద్రకు మాత్రమే పనికి వస్తున్నాయి. ఇలాగే జీవితం గడిచిపోతుంది అని నిరాశ పడవలిసిన అవసరం ఎంతమాత్రం లేదు.
శృంగార జీవితాన్ని సుఖవంతం చేసుకోవడానికి కొన్ని చక్కని మార్గాలను ఎంచుకుంటే సమస్య తీరిపోతుంది. వీక్ ఎండింగ్ లో కేవలం రాత్రి నే కాదు,పగటి సమయం కూడా కరిగించే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అలా చేసుకోవాలి అనుకునే దంపతుల కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి అవేంటో తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. రోజు ఉండే బిజీ తో శృంగారానికి సరైన సమయం కొరకడం చాలా కష్టం. ప్రతి రోజూ ఉదయాన్నే లేవాలి ఒకవేళ లేట్ అయితే రోజంతా పనులు ఆలస్యం అయిపోతాయి అన్న టెన్షన్ తో శృంగారం గురించి ఆలోచించరు నెమ్మదిగా ఆశక్తి కూడా తగ్గిపోతుంది.శృంగారం అంటేనే బద్ధకించేస్తారు. దీనివల్ల మగవారిలో నిస్పృహ చోటుచేసుకుని మీ ఇద్దరి మధ్య దూరం పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మగవారిలో టెస్టోస్టిరాన్ విడుదల వలన ప్రతి అర గంటకు ఒకసారి మగవారు శృంగారం గురించి ఆలోచన చేస్తుంటారు అని అనేక పరిశోధనల్లో తేలింది. కాబట్టి ఆడవారు తన భాగస్వామిని నిస్పృహ పోగొట్టడానికి రాత్రివేళ క్యాండిల్ లైట్‌లో డిన్నర్, వెన్నెలలో కబురులు చెప్పుకోవడం లాంటివి ఏర్పాటు చేస్తే నిస్పృహ పోయి వారి మనస్సు శృంగారం వైపు వెళ్లి ఉత్సాహం గా ఉంటారు .
వీక్ ఎండింగ్ వరకు పనులన్నీ వాయిదా వేసుకోకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుంటేనే మీ ఇద్దరికీ కలిసి సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. వీక్ ఎండింగ్ లో ఏమైనా పని చేసుకోవాలిసి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి పని చేసుకోవడం వలన రొమాన్స్ కి కావలిసినంత టైం దొరుకుతుంది.