NewsOrbit
హెల్త్

ఇంటి పని ఆఫీస్ పని చేస్తున్న మీరు ఈ సమస్య గురించి ఎప్పుడైనా ఆలోచించారా!!

ఇంటి పని ఆఫీస్ పని చేస్తున్న మీరు ఈ సమస్య గురించి ఎప్పుడైనా ఆలోచించారా!!

ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబం విద్యావంతమవుతుందని అంటారు. అలాగే ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యవంతం గా ఉంటుంది అంటారు. ఎందుకంటే స్త్రీ లు కుటుంబ బాధ్యతలతోపాటు ఉద్యోగ బాధ్యతలు మోస్తున్నారు. పిల్లల ఆలనా పాలన, చదువులు, భర్త, అత్తామామల ఆలనాపాలనలు, సమయానికి అన్నీ సమకూర్చాలి, ఇంకోపక్క ఉద్యోగ బాధ్యతలు, ఇవన్నీ చాలా మంది స్త్రీ ల జీవితాలలో భాగాలే!

ఇంటి పని ఆఫీస్ పని చేస్తున్న మీరు ఈ సమస్య గురించి ఎప్పుడైనా ఆలోచించారా!!

వీటిలో ఏ ఒక్కదాన్లో లోటు లేకుండా చక్కబెట్టుకోవాలి. ఈ పనులు చేయడం లో అవసరమైతే పరుగులెత్తాలి. పనుల్లో వేగం పెంచవలిసి ఉంటుంది. ఆ విధం గా  ఇంట్లో, ఇటు ఆఫీసుల్లోని పనులు ఎంతో సమర్ధవంతం గా నిర్వహిస్తుంటారు. అలాంటి వారు భవిష్యత్‌ లో ఎన్నో  శారీరక, మానసిక, సమస్యలు ఎదుర్కోవలిసి వస్తుందని అధ్యయనాలు దృవీకరిస్తున్నాయి. వారంలో 55 కంటే ఎక్కువ గంటలు పనిచేసే స్త్రీలు  నిరాశ, కుంగుబాటు, ఆందోళన చెందడం వంటి మానసిక పరమైన సమస్యలను ఎదుర్కొంటారని తాజా అధ్యయానాలు తేల్చి చెప్తున్నాయి.

బ్రిట్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు దీని పై పరిశోధన జరిపారు. 20వేల మంది పై జరిగిన ఈ పరిశోధన లో ఆసక్తికర నిజాలు తెలిసాయి. 35 నుంచి 40 గంటలు పనిచేస్తున్న మహిళలతో పోలిస్తే అంతకన్న ఎక్కువ గంటలు పనిచేసిన వారికి మానసిక పరమయిన సమస్యలు ఎక్కువగా ఉంటాయని తెలిసింది. ఈ సమస్యలు మితిమీరితే శారీరక సమస్యలుగా మారి గుండెసమస్యలకు కారణమవుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా సెలవులు కూడా లేకుండా పనిచేసే వారిలో ఈ ప్రమాదం చాలఎక్కువగా ఉంటుందని, ఇది మగవారికికూడా వర్తిస్తుందని చెబుతున్నారు. జీవితం లోఎదుగుదల ముఖ్యమే. కానీ, ఆరోగ్యంగా ఉంటేనే ఎదగడం సాధ్యమని గుర్తుంచుకోవాలి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri