World Cancer Day 2023: ప్రాణాంతకమైన వ్యాధులలో క్యాన్సర్ కూడా ఒకటి.. ఈ రోజుల్లో క్యాన్సర్ భారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.. మన శరీరంలో క్యాన్సర్ కణాలు ఒక్కొక్కటిగా మొదలై అవి రెండు నాలుగు ఇలా వాటి సంఖ్య పెరుగుతూ పోతాయి.. ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడి మిలియన్ల మంది చనిపోతున్నారు. ప్రతి 6 మందిలో క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు.. ఎక్కువగా రొమ్ము, ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, పురిషనాళం క్యాన్సర్ బారిన పడుతున్నారు. 30 శాతం వరకు క్యాన్సర్ ను ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే నయం చేయవచ్చు. క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే.. ఒకవేళ ఈ సమస్య బాధపడుతున్న వారు ఈ ఆహార పదార్థాలు మీ డైట్ లో భాగం చేసుకోవాలి.. క్యాన్సర్ కణాలకు అడ్డుకట్ట వేయడానికి 10 ఆహార పదార్థాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!

1. వైట్ ఆల్మండ్..
సీమబాదం అదే వైట్ ఆల్మండ్.. ఇందులో ఏమీగల్డిన్ అనే విటమిన్ బి12 యొక్క రసాయనిక సమ్మేళనం ఉంటుంది.. ఇది క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.. సీమబాదం కు క్యాన్సర్ కణాల విభజన ఆపే శక్తి ఉంది.. 2018 లో యూనివర్సిటీ ఆఫ్ లార్జ్ పోలెండ్ వారు నిర్వహించిన పరిశోధనలో క్యాన్సర్ ను అడ్డుకోవడానికి ఏమీగల్డిన్ అవసరం.. ఇది సీమ బాదంలో సహజ సిద్దంగా లభిస్తుంది. సీమ బాదం పప్పులను ప్రతిరోజు 10 తినాలి.. ఇందులో ఉండే విటమిన్ బి 12 క్యాన్సర్ కణాల విభజనను అడ్డుకుంటుంది. కొత్తగా క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా చేస్తుంది. క్యాన్సర్ బారిన పడిన వారు ప్రతిరోజు వారి డైట్ లో వైట్ ఆల్మండ్ ను భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ప్రతి రోజూ వీటిని తీసుకోవడం వలన క్యాన్సర్ బారినపడే ముప్పు నుంచి బయటపడవచ్చు. చిన్న పిల్లలు కూడా వీటిని తినిపించడం వల్ల క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి ఏర్పడుతుంది.. వైట్ ఆల్మండ్ ను ప్రతి ఒక్కరూ కచ్చితంగా తినాలి.
2. చెర్రీ:
క్యాన్సర్ ను అడ్డుకునే ఆందోసైనిన్స్ చెర్రీ పండ్లలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి రొమ్ము క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ను నివారించడంలో సహాయపడతాయి. పాంక్రియాటిక్ క్యాన్సర్ చాలా ప్రాణాంతకమైనది. ఈ క్యాన్సర్ వచ్చిన ఆరు నెలలోనే ప్రాణాలు తీస్తుంది. చెర్రీ పండ్లలో ఉండే దీనిపై ప్రభావం చూపుతాయి.

3. బ్లూ బెర్రీస్:
బ్లూ బెర్రీస్ లో క్యాన్సర్ ను అడ్డుకునే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. అంతేకాకుండా ఇవి డిఎన్ఏ నిరోధించే గుణాలను కలిగి ఉన్నాయి. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం బ్లూ బెర్రీస్ తింటే క్యాన్సర్ ను అడ్డుకుంటాయి.
4. ద్రాక్ష:
ద్రాక్ష పండు లో బోర్ గా వెయిటింగ్ అనే బయో ఆక్టివ్ సమ్మేళనం ఉంటుంది. ఇది క్యాన్సర్ ను నిరోధిస్తుంది. ద్రాక్షల్లో ఉండే యాంటి ఇన్ఫ్లమేటరీ , యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయి. ఇవి రొమ్ము, కాలేయం, చర్మ, ఊపిరితిత్తులు, గ్లియోమో, మల్టిపుల్ మైలోమా క్యాన్సర్ ను రాకుండా నివారిస్తాయి.
5.దానిమ్మ:
దానిమ్మ పండ్ల లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కు దారితీసే డిఎన్ఎ దెబ్బతినకుండా చేస్తుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ క్యాన్సర్ నివారిస్తుంది.
6.నల్ల పుట్టగొడుగులు:
నల్లని పుట్టగొడుగులను ఇంగ్లీషులో ట్రఫిల్ మష్రూమ్స్ అంటారు.. వీటిని అనేక ఔషధ మందుల తయారీ లో ఉపయోగించే వారు వీటిని కూరగా వండుకుని తినవచ్చు.. నల్లని పుట్టగొడుగులు మాత్రం ఎలాంటి క్యాన్సర్ నైనా నయం చేయగలుగుతారని తాజా పరిశోధనలో తేలింది.. వీటిని తరచూ తింటుంటే క్యాన్సర్ ను అడ్డుకుంటాయని పరిశోధకులు చెబుతున్నారు..
ట్రఫిల్ పుట్టగొడుగుల లో పిండి పదార్థాలు, మాంస కృత్తులు, ఫైబర్, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. మన శరీరానికి అవసరమైన తొమ్మిది అమైనో ఆమ్లాలు ఉన్నాయి. సర్వైకల్, బ్రెస్ట్, కొలెన్ క్యాన్సర్ కణాలు ఎదుర్కోవడం లో ఈ పుట్ట గొడుగులు బాగా పని చేస్తున్నాయని తాజా అధ్యయనాలలో తేలింది.
7. అల్లం నూనె:
పరగడుపున అల్లం నూనె ను వేడి వేడి నీటిని తాగడం వలన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది. అల్లంలో సహజంగా క్యాన్సర్ ని అడ్డుకునే గుణాలను కలిగి ఉంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, చర్మ క్యాన్సర్ ను ఎదుర్కొనడంలో అల్లం నూనె అద్భుతంగా పనిచేస్తుంది.
8.బ్లాక్ క్యారెట్:
బ్లాక్ క్యారెట్ లో ఆందోసైనిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. అంతే కాకుండా క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. క్యాన్సర్ కార్యకలాపాలను తటస్థం చేయడంలో బ్లాక్ క్యారెట్ అద్భుతంగా సహాయపడుతుంది. అందువలన క్యాన్సర్ మీ దరి చేరకుండా ఉండాలంటే బ్లాక్ క్యారెట్ ను మీ డైట్లో భాగం చేసుకోవాలిసిందే.
9. కూరగాయలు: మాంసం తినే వారి కంటే మాంసం తక్కువ తినేవారికి అన్ని రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ రెండు శాతం తక్కువ. చేపలు తినేవారిలో క్యాన్సర్ బారిన పడే అవకాశం 10 శాతం తక్కువ.. కూరగాయలు తినే వారిలో అయితే క్యాన్సర్ రిస్క్ బారినపడే అవకాశం 14 శాతం తక్కువ కావడం విశేషం. అదే వెజిటేరియన్ డైట్ మహిళల్లో మెనోపాజ్ తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశం 18 శాతం తక్కువ. చేపలు తినే పురుషుల్లో ప్రొటెస్ట్ క్యాన్సర్ రిస్క్ 20 శాతం, కూరగాయలు తినే మగ వారిలో 31 శాతం తక్కువని తాజా అధ్యయనంలో తేలింది. వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్, క్యాన్సర్ రీసెర్చ్ యుకె, ఆక్స్ఫర్డ్ పాపులేషన్ హెల్త్ కూడా కూరగాయలు తినేవాళ్ళకు క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ అని చెబుతుంది.
ఇక కూరగాయల విషయానికి వస్తే బ్రకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ ఉండే ఫైటోకెమికల్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ముందుంటాయి. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. ఇంకా డిఎన్ఎ దెబ్బతినకుండా రక్షిస్తాయి.
10. బిళ్ళ గన్నేరు:
బిళ్ళ గన్నేరు పొడితో డికాషన్ తయారు చేసుకొని తాగడం వలన క్యాన్సర్ తగ్గుతుంది. లేదంటే బిల్లగన్నేరు ఆకుల రసం తీసి ప్రతిరోజు తాగినా కూడా క్యాన్సర్ నుండి బయట పడవచ్చు
11. సముద్రపు పాచి చక్కెర..
సముద్రపు పాచి నుండి తయారుచేసిన చక్కెర ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్ కూడా నయం చేయడానికి ఉపయోగపడుతుందని తాజా పరిశోధనలు తెలుపుతున్నాయి. ఎరుపు, గోధుమ రంగు సముద్రపు పాచి నుండి తీసిన చక్కెరలో క్యాన్సర్లు ఎదుర్కొనే కారకాలు ఉన్నాయని.. ఇవి యాంటీ ట్యూమర్ నుంచి బయట పడేస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అనేక అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది.. ఏడు సంవత్సరాల పాటు సముద్రపు పాచి చక్కర మీద చేసిన ప్రయోగాల ఫలితాల ఆధారంగా ఈ విషయాలను తెలియజేశారు.