తొలి అనుభవాన్ని చవిచూసే సమయంలో… అమ్మాయిలతోపాటు… అబ్బాయిల్లోనూ కంగారు ఉంటుందటతొలిసారి శృంగారంలో పాల్గొనాలి అంటే ఎవరికైనా కాస్త కంగారుగానే ఉంటుంది.
మనదేశంలో సెక్స్ గురించి చర్చించుకోవడం కూడా పెద్ద నేరంగా పరిగణిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది తమకు ఉన్నఅనుమానాల్ని లో లోపలే దాచేసుకుంటారు. ఈ తరం అబ్బాయిల్లో ఈ రకం అనుమానాలు చాలా వస్తున్నాయని ఓ సర్వేలో తేలింది.
సాధారణంగా అబ్బాయిలకు ఉండే అపోహలు ఏంటో ఒకసారి చూద్దాం.‘‘నా పురుషాంగం చాలా చిన్నగా ఉంటుంది. జీవిత భాగస్వామిని సంతృప్తి పరచలేనేమో” అన్న భయం నూటికి 70శాతం మంది కి ఉండి ఆ అపోహతో కుమిలిపోతుంటారు. నిజానికి..పురుషాంగ పరిమాణానికి, లైంగిక సామర్థ్యానికి ఎలాంటి సంబంధమూ లేదు. సెక్స్‌లో భాగస్వామిని సంతృప్తిపరచడం ఒక కళ. ఆ కళలో నైపుణ్యం ఉంటే సరిపోతుంది.
మీ జీవిత భాగస్వామిని మనసారా ప్రేమించి.. ఆమె ఆమె ఇష్టాలను ,ఇబ్బందులను అర్థం చేసుకుంటే సరిపోతుంది. శరీరంలో టెస్టోస్టెరాన్ నిల్వలు తగ్గినప్పుడు మాత్రమే వైద్యులను సంప్రదించి ట్యాబ్లెట్స్ వాడితే సరిపోతుంది. కొందరు యువకులకైతే పెళ్లి తర్వాత కూడా కొన్ని అపోహలు పెట్టుకుంటారు. నా భార్య కి సుఖం ఇవ్వగలుగుతున్నానా లేదా అనే అనుమానం వారికీ కలుగుతూ ఉంటుందంటా.
దానికి గల కారణము… పడక గదిలో తప్పితే..తన భార్య ఎప్పుడు అడిగినా శృంగారానికి ఆసక్తి చూపించదని వాపోతుంటారు. నిజానికి మన శరీరంలో ఉుండే టెస్టో స్టెరాన్ హార్మోను స్త్రీ పురుషుల్లో లైంగికత్వాన్ని నిర్ణయిస్తుంది. మగవారిలో టెస్టో స్టెరాన్ హర్మోన్ ప్రభావం పది నుంచి 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే వారిలో కోరికలు ఎక్కువగా కలుగుతుంటాయి.
పురుషులతో పోలిస్తే.. స్త్రీలలో ఈ హార్మోన్ల ప్రభావం కాస్త తక్కువగా ఉంటుంది. అందుకే స్త్రీలలో కోరికలు కూడా పురుషులకు కలిగినంత ఎక్కవగా కలగవని నిపుణులు చెబుతున్నారు.ఈ విషయం తెలియని పురుషులు తమ భార్యలను అనుమానిస్తూ ఉంటారు . ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా శృగార జీవితితాన్ని ఆనందించాలి అంటున్నారు నిపుణులు . ఏమైనా సమస్య ఉంటె డాక్టర్ దగ్గరికి వెళ్లి పరిష్కరించుకోవాలి తప్ప అపోహలకు చోటు ఇవ్వకూడదు .