ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సమస్యలు ఏదోక రూపంలో ఎదురవుతూనే ఉన్నాయి. అంతే కాకుండా ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నా వాటి నుండి బయట పడటం లేదు. ఎందుకంటే తీసుకునే ఆహార పదార్థాలలో మార్పులు చాలా ఉన్నాయి. కొలెస్ట్రాల్ ని పెంచే ఆహార పదార్థాలు, కొవ్వు పదార్ధాలు లాంటివి ఎక్కువగా ఉండడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి.
కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఎక్కువ వ్యాయామాలు చేయాలి. ముఖ్యంగా మన శరీరంలో ముఖ్య భాగం గుండె. మనకు ఏదైనా చిన్న సమస్య ఎదురైతే…గుండె వరకు దారితీసే అవకాశాలున్నాయి. మన శరీరంలో నీరు శాతం ఎక్కువై… ఏవైనా ఇన్ఫెక్షన్లు వంటివి కలిగితే అవి కిడ్నీల నుండి గుండె వరకు సమస్యలు తెస్తాయి. కాబట్టి మనం తీసుకునే ఆహార పదార్థాలలో కొవ్వు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా హెవీ ఫుడ్ లాంటివి తీసుకుంటే దానికి తగ్గట్టుగా వ్యాయామాలు, యోగాలు చేయాలి.
ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే అందులో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. అంతే కాకుండా శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి. కొవ్వుతో కూడిన మాంసాహారాన్ని తీసుకోవడం తగ్గించాలి. మాంసాహారం ఎక్కువగా కొవ్వు ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ సరిగా ఉండదు. కూరగాయల జ్యూస్ తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు రావు.
కూరగాయల జ్యూస్ వల్ల పోషక విలువలు ఎక్కువగా ఉండి.. శరీరంలోని కొవ్వు శాతంను అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా పప్పు ధాన్యాలను, నానబెట్టి మొలకెత్తిన గింజలను ఎక్కువ గా తీసుకోవడం మంచిది. జంక్ ఫుడ్ వాటికి దూరంగా ఉండాలి. ఇలా వ్యాయామాలు, ఎక్సర్సైజులు, తీసుకునే ఆహార పదార్థాలలో పోషక విలువలు ఉండేటట్లు చూసుకోవాలి. ఏదైనా గుండె సమస్య వస్తే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.