“మే” త్వరగా వచ్చేయమ్మా…!

03 Mar, 2020 - 01:40 PM

హీరో నితిన్ కు మే నెల త్వరగా వచ్చేయాలట. అప్పటి వరకు అస్సలు ఆగలేరట. అసలే భీష్మ సక్సెస్ తో ఎంజాయ్ చేస్తున్న నితిన్ కి మే నెలతో పనేముంది అనుకుంటున్నారా? మే నెల కోసం ఆయన ఎందుకు అంత ఆత్రుత గా ఎదురు చూస్తున్నారా అనుకుంటున్నారా? మే లో పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” రిలీజ్ కదా అందుకేనన్నమాట. నితిన్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని వేరే చెప్పక్కర్లేదు. నిన్న పవనుడి వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ విడుదలైంది. నెట్టింట హల్చల్ చేస్తుంది. ప్రతి ముగ్గురి కలయికలో ఇద్దరి మధ్య టాపిక్ ఇదే నడుస్తుంది. కూల్ గా కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని, కాలు చాపుకుని పవనుడు హాయిగా సేదతీరుతున్న లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అందుకే ప్రపంచంలోనే ట్రేండింగ్ జాబితాలోకి వెళ్ళిపోయి టాప్ 5 లో నిలిచింది. కేవలం పవన అభిమానులే కాకుండా సగటు సినీ ప్రేక్షకులకు కూడా ఈ చిత్రంపై అంచనాలున్నాయి. రెండేళ్ల విరామం తర్వాత పవన్ నటిస్తుండడం, హిందీ లో విజయవంతమైన పింక్ చిత్రానికి ఇది రీమేక్ కావడం అంచనాలను పెంచింది. ఇక ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా… వంటి సమాజిక మాధ్యమాల వేడుకల్లోనూ ఈ స్టిల్ విపరీతంగా తిరుగుతుంది. సినీ హీరో నితిన్ తో పాటూ, దర్శకుడు మారుతీ కూడా ఆసక్తికరమైన ట్వీట్ చేసారు. ఇచ్చట పాత రికార్డులు చెరిపివేయబడును అంటూ పవన్ చిత్రాన్ని ఉద్దేశించి, ట్వీట్ చేసి పవన్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు. అదీ మరి సినిమాల్లో పవన్ సత్తా. రాజకీయాల్లో కాస్త వెనుకబడినా సినిమాల్లో మాత్రం పవన్ హవా ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తుంది.