Daily Horoscope in Telugu ఏప్రిల్ 22 – శనివారం – వైశాఖమాసం – రోజు వారి రాశి ఫలాలు
మేషం: Aries Horoscope in Telugu April 22
వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఇంటాబయట ఋణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి.

వృషభం: Taurus Horoscope in Telugu April 22
గృహమునకు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్ధిరాస్తి వ్యవహారాలలో వివాదాలు రాజీ చేసుకుని ఆర్థిక లాభాలు అందుకుంటారు. గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలసివస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలుచేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత లాభసాటిగా సాగుతాయి.
Gemini Horoscope in Telugu April 22
స్థిరస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రం సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపారపరంగా శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురవుతారు.
కర్కాటకం: Cancer Horoscope in Telugu April 22
ఆర్థిక వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల ప్రశంసలు అందుకుంటారు. బంధు మిత్రుల నుండి శుభ వర్తమానాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.
సింహం: Leo Horoscope in Telugu April 22
ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. పాత మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
కన్య: Virgo Horoscope in Telugu April 22
అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు సన్నిహితులతో అకారణంగా విభేదిస్తారు. శారీరక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వ్యాపార ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది.
తుల: Libra Horoscope in Telugu April 22
దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సోదరులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలలో భాగస్థులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్ధిక సమస్యలు చికాకు పరుస్తాయి.

వృశ్చికం: Scorpion Horoscope in Telugu April 22
ధన పరంగా లోటు ఉండదు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
ధనస్సు: Sagittarius Horoscope in Telugu April 22
బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో స్ధిరాస్తి తగాదాలను రాజీ చేసుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారమున ఆలోచనలు కలసి వస్తాయి. ఉద్యోగమున పురోగతి సాధిస్తారు.
మకరం: Capricorn Horoscope in Telugu April 22
వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.
కుంభం: Aquarius Horoscope in Telugu April 22
సోదర వర్గం నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్థుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమ పెరిగినప్పటికీ నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చేస్తారు.
మీనం: Pisces Horoscope in Telugu April 21
భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.
నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…