NewsOrbit
Horoscope దైవం

Daily Horoscope: ఏప్రిల్ 25 – వైశాఖమాసం – రోజు వారి రాశి ఫలాలు

Daily Horoscope in Telugu April 19 2023 Rasi Phalalu
Share

Daily Horoscope in Telugu ఏప్రిల్ 25 – మంగళవారం – వైశాఖమాసం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. ఇంటాబయట బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమున ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారమున లాభాలు అందుకుంటారు.

Daily Horoscope in Telugu April 19 2023
Daily Horoscope in Telugu April 25 2023

వృషభం
వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు మానసికంగా ఆనందం కలిగిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.
మిధునం
వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సోదరులతో శుభకార్యాలు గూర్చి చర్చిస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. దూరప్రాంత బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.
కర్కాటకం
అనారోగ్య సమస్యల నుండి బయట పడతారు. జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
సింహం
సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు కొంత వరకు తొలగుతాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వస్త్ర వస్తు లాభాలు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి. అందరి మన్ననలు పొందుతారు.
కన్య
నూతన వ్యాపార ప్రారంభానికి ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభిస్తాయి.
తుల
భాగస్వామ్య వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిదికాదు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి.
వృశ్చికం
జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఎదురైనప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

Daily Horoscope in Telugu April 19 2023 Rasi Phalalu
Daily Horoscope in Telugu April 25 2023 Rasi Phalalu

ధనస్సు
వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఇంటాబయట సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
మకరం
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
కుంభం
నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. భూ సంభందిత క్రయవిక్రయాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు అధిగమిస్తారు.
మీనం
స్ధిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలసివస్తాయి. వాహన యోగం ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో సమయపాలనతో పనులు పూర్తి చేస్తారు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..


Share

Related posts

స్పటికమాల ధరిస్తే కలిగే లాభాలు ఇవే !

Sree matha

భద్రాదిలో నవరాత్రులు !

Sree matha

Daily Horoscope: మే 22 –జ్యేష్ఠమాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma