NewsOrbit
Horoscope దైవం

Daily Horoscope: జూలై 31 – ఆధిక శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

Daily Horoscope in Telugu జూలై 31 – అధిక శ్రావణమాసం – సోమవారం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.


వృషభం
కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. బంధుమిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.
మిధునం
నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. గృహనిర్మాణ ప్రయత్నాలు త్వరితగతిన పూర్తి కావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

Daily Horoscope in Telugu April 19 2023
Daily Horoscope in Telugu JULY 31th 2023

కర్కాటకం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుకుంటారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది.
సింహం
కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. గృహమున బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన విద్యా విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.
కన్య
జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహంలో చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్ధిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి.
తుల
వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
వృశ్చికం
ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరుల సహాయంతో వివాదాల నుండి బయట పడతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది.
ధనస్సు
కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోరాదు. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆలయ సందర్శన చేసుకుంటారు. ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
మకరం
ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.
కుంభం
చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఋణ ప్రయత్నాలు కలిసిరావు.
మీనం
గృహమున బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో …

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

March 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 3 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 2 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

March 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 1 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 29 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 28 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 27 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 26 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 25 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 24 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 23 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 22 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 21 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 20 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 19 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

February 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఫిబ్రవరి 18 మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju