Daily Horoscope in Telugu జూన్ 12 – సోమవారం – జ్యేష్ఠమాసం – రోజు వారి రాశి ఫలాలు
మేషం : Aries Horoscope in Telugu Jun 12
చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. మిత్రుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృషభం : Taurus Horoscope in Telugu Jun 12
ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఆకస్మిక ధన లాభసూచనలున్నవి. నూతన వస్తు లాభాలు పొందుతారు. స్థిరస్థి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి పొందుతారు.
మిధునం : Gemini Horoscope in Telugu Jun 12
అవసరానికి ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
కర్కాటకం : Cancer Horoscope in Telugu Jun 12
ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. పనులలో తొందరపాటు చేసి ఇబ్బందికి గురి అవుతారు. కొన్ని వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. దూరప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.

సింహం : Leo Horoscope in Telugu Jun 12
ఇతరుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో చేతికందదు. దూరప్రయాణం సూచనలు ఉన్నవి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
కన్య : Virgo Horoscope in Telugu Jun 12
సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతాన విద్యా విషయాలలో అప్రయత్న విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు సానుకూలమవుతాయి.
తుల : Libra Horoscope in Telugu Jun 12
వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన విషయాలుపై ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ పరమైన పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
వృశ్చికం : Scorpion Horoscope in Telugu Jun 12
గృహ నిర్మాణ పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారమున నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.
ధనస్సు : Sagittarius Horoscope in Telugu Jun 12
చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యం తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు మందగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బందు మిత్రులతో వివాదాలు కలుగుతాయి.
మకరం : Capricorn Horoscope in Telugu Jun 12
ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. చిన్న నాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
కుంభం : Aquarius Horoscope in Telugu Jun 12
దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయట ఊహించని సమస్యలు ఉంటాయి. సంతాన అనారోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.
మీనం : Pisces Horoscope in Telugu Jun 12
ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.
నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…