Daily Horoscope in Telugu జూన్ 25 – ఆషాడమాసం – ఆదివారం – రోజు వారి రాశి ఫలాలు
మేషం : Aries Horoscope in Telugu Jun 25
గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలుచేస్తారు.

వృషభం : Taurus Horoscope in Telugu Jun 25
కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సహోద్యోగులతో వివాదాలుంటాయి.
మిధునం : Gemini Horoscope in Telugu Jun 25
ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు వ్యవహారాలు మందగిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నలోపం లేకపోయినా ఫలితం ఉండదు.
కర్కాటకం : Cancer Horoscope in Telugu Jun 25
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లబిస్తుంది. ఉద్యోగమున మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.
సింహం : Leo Horoscope in Telugu Jun 25
కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థికంగా అవసరానికి ధనం లభించక ఇబ్బంది పడతారు. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు.
కన్య : Virgo Horoscope in Telugu Jun 25
సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆకస్మిక ధనలాభం పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి.
తుల : Libra Horoscope in Telugu Jun 25
దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. వ్యాపార వ్యవహారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ప్రయత్నాలు కలిసిరావు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వృశ్చికం : Scorpion Horoscope in Telugu Jun 25
గృహమునకు చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక సమాచారం సేకరిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులుంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
ధనస్సు : Sagittarius Horoscope in Telugu Jun 25
నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ యత్నాలు వేగవంతం చేస్తారు. ప్రయాణాలలో చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాలబాట పడుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.
మకరం : Capricorn Horoscope in Telugu Jun 25
జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి.
కుంభం : Aquarius Horoscope in Telugu Jun 25
దూరపు బంధువులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. వ్యాపారమున నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. విద్యార్థులు పోటీపరీక్షలలో మరింత కష్టపడాలి.
మీనం : Pisces Horoscope in Telugu Jun 25
సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. సోదరుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.
నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….