Daily Horoscope in Telugu మే 10 – బుధవారం – వైశాఖమాసం – రోజు వారి రాశి ఫలాలు
మేషం : Aries Horoscope in Telugu May 10
ఇంటబయట శుభ ఫలితాలను పొందుతారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి. దైవానుగ్రహం తో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో భవిష్యత్తు ప్రణాళికను చేస్తారు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఉత్తమ ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది.

వృషభం : Taurus Horoscope in Telugu May 10
శారీరక మానసిక అనారోగ్యాలు ఉంటాయి. ఇతరుల మీద మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. అనుకొన్న సమయానికి అనుకున్న రీతిలో పనులు పూర్తికాక ఇబ్బందికి గురవుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులు కోపానికి గురి కావల్సి వస్తుంది. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి.
మిధునం : Gemini Horoscope in Telugu May 10
నూతన వస్తు,వాహన సౌకర్యం పొందుతారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. ఉద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.
కర్కాటకం : Cancer Horoscope in Telugu May 10
ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.
సింహం : Leo Horoscope in Telugu May 10
ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారమున ఆలోచన లో స్థిరత్వం లోపిస్తుంది. శరీర ఆరోగ్య సమస్యలు కొంత కలవర పెడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
కన్య : Virgo Horoscope in Telugu May 10
ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పాత మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.
తుల : Libra Horoscope in Telugu May 10
నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల మంచి జరుగుతుంది. కొన్ని వ్యవహారాలు ఆత్మవిశ్వాసంతో దైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. వృత్తిఉద్యోగాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి.
వృశ్చికం : Scorpion Horoscope in Telugu May 10
ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. సౌకర్యాల కొరత లేకున్నా ఇతరుల వలన ఇబ్బందులు ఉంటాయి. కారణం లేకుండానే కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు మానసిక చింతను కలిగిస్తాయి.

ధనస్సు : Sagittarius Horoscope in Telugu May 10
దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది విలువైన వస్తువులను సేకరించి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు అనుకూల సమయం.
మకరం : Capricorn Horoscope in Telugu May 10
చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి. బంధువుల నుండి ఋణ వత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగ విషయమై చెయ్యను పనికి నిందలు పడతారు. నిరుద్యోగ ప్రయత్నాలకు నిరాశ తప్పదు.
కుంభం : Aquarius Horoscope in Telugu May 10
బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత కలుగుతుంది. విలువైన వస్తువులు బహుమతులుగా లభిస్తాయి.
మీనం : Pisces Horoscope in Telugu May 10
ఇతరులతో వివాదాలు కలిగిన విజయం కలుగుతుంది. వృత్తి,ఉద్యోగాలలోఅధికారుల ఆదరాభిమానాలకు పొందుతారు. వ్యాపారపరంగా ఆత్మ విశ్వాసంతో స్థిర నిర్ణయాలు అమలుపరచి మంచి ఫలితాలను సాధిస్తారు. నిరుద్యోగులు లభించిన అవకాశాలను జారవిడువకుండా చూసుకో సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….