Daily Horoscope in Telugu మే 16 – మంగళవారం – వైశాఖమాసం – రోజు వారి రాశి ఫలాలు
మేషం : Aries Horoscope in Telugu May 16
మిత్రుల నుండి కొంత ఆసక్తి సమాచారం అందుతుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు.

వృషభం : Taurus Horoscope in Telugu May 16
ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. వ్యాపార ఉద్యోగాలలో సకాలంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
మిధునం : Gemini Horoscope in Telugu May 16
నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు.
కర్కాటకం : Cancer Horoscope in Telugu May 16
దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి సహాయం అందక ఇబ్బంది పడతారు. పాత ఋణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
సింహం : Leo Horoscope in Telugu May 16
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. రావలసిన ధనం సకాలంలో అందక నిరాశ కలుగుతుంది. వ్యాపారాలలో శ్రమ అధికమవుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది.
కన్య : Virgo Horoscope in Telugu May 16
నూతన వ్యక్తుల పరిచయాలు ఉపయోగపడతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్ధిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది.
తుల : Libra Horoscope in Telugu May 16
నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమౌతాయి. బంధు మిత్రులతో వివాదాలు తీరుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.

వృశ్చికం : Scorpion Horoscope in Telugu May 16
సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పెరుగుతాయి. ధన పరంగా ఒడిదుడుకులు అధికమౌతాయి. అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగపరంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక మానసిక సమస్యలు కలుగుతాయి.
ధనస్సు : Sagittarius Horoscope in Telugu May 16
నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ప్రశాంతత కోసం దైవదర్శనం చేసుకోవడం మంచిది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
మకరం : Capricorn Horoscope in Telugu May 16
కొన్ని వివాదాలకు సంబంధించి సన్నిహితులు నుండి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నూతన వస్తు లాభాలు పొందుతారు. సమాజంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
కుంభం : Aquarius Horoscope in Telugu May 16
బంధు మిత్రుల మాటలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. అధిక శ్రమతో గాని పనులు పూర్తి కావు. ఇంటాబయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు కలిగే సూచనలున్నవి. ఉద్యోగాలలో అధికారులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.
మీనం : Pisces Horoscope in Telugu May 16
కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది.
నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….