NewsOrbit
Horoscope దైవం

Daily Horoscope: మే 21 –జ్యేష్ఠమాసం – రోజు వారి రాశి ఫలాలు

Daily Horoscope in Telugu April 19 2023 Rasi Phalalu
Share

Daily Horoscope in Telugu మే 21 – ఆదివారం – జ్యేష్ఠమాసం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
ఆర్థికంగా అవసరానికి సహాయం అందుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలలో ఆర్థిక లబ్ది కలుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

Daily Horoscope in Telugu April 19 2023
Daily Horoscope in Telugu May 21st 2023

వృషభం
చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన ప్రయత్నాలు అంతగా కలిసి రావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చు విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో అధికారులతో చికాకులు కలుగుతాయి. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి.
మిధునం
కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాల బాట పడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది.
కర్కాటకం
ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగి చికాకులు అధికమవుతాయి. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు శ్రమతో కూడి ఉంటాయి. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
సింహం
వ్యాపార ఉద్యోగాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు సకాలంలో అందుతాయి.
కన్య
ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దలు సలహాలు తీసుకోవడం మంచిది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అనుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు ఉంటాయి.
తుల
వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.
వృశ్చికం
వ్యాపార వ్యవహారాలలో అవరోధాలు తొలగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో చేయడం మంచిది కాదు. తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు.

Daily Horoscope in Telugu April 19 2023 Rasi Phalalu
Daily Horoscope in Telugu May 21st 2023 Rasi Phalalu

ధనస్సు
గృహమున వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ విషయంలో అధికారులతో సఖ్యత గా వ్యవహరించి ఉన్నత పదవులు పొందుతారు.
మకరం
నూతన గృహ వాహన యోగం ఉన్నది నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సహకార విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో అంచనాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.
కుంభం
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశ పడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి.
మీనం
ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. కుటుంబ విషయాలలో స్థిరత్వం లేని ఆలోచనలు వలన వివాదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. నూతన రుణాలు చేయకపోవడం మంచిది నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…


Share

Related posts

లక్ష్మీదేవిని ఉసిరికాయ దీపాలతో పూజిస్తే ?

Sree matha

Circumambulation: దేవాలయం చుట్టూ ప్రదక్షిణము ఎందుకు చెయ్యాలి ??

Naina

మానస సరోవరం అంటే శివుడికి ఎందుకు అంత ఇష్టం ? అక్కడే ఎందుకు ఉంటాడు ?

Kumar