NewsOrbit
Horoscope దైవం

Daily Horoscope: మే 23 –జ్యేష్ఠమాసం – రోజు వారి రాశి ఫలాలు

Daily Horoscope in Telugu April 19 2023 Rasi Phalalu
Share

Daily Horoscope in Telugu మే 23 – మంగళవారం – జ్యేష్ఠమాసం – రోజు వారి రాశి ఫలాలు

మేషం
ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటాబయట మానసిక సమస్యలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.

Daily Horoscope in Telugu April 19 2023
Daily Horoscope in Telugu May 23ed 2023

వృషభం
దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఋణ ఒత్తిడి నుండి బయటపడతారు.
మిధునం
మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు.
కర్కాటకం
సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. స్ధిరాస్తి కొనుగోలు చేస్తారు.వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
సింహం
చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది.
కన్య
ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది.

Daily Horoscope in Telugu April 19 2023 Rasi Phalalu
Daily Horoscope in Telugu May 23ed 2023 Rasi Phalalu

తుల
ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.
వృశ్చికం
కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
ధనస్సు
మానసిక ప్రశాంతత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆలోచనలో ఆచరణలో పెడతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
మకరం
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధువర్గం వారితో విభేదాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది.
కుంభం
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలుచేస్తారు. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు.కలిసిరావు. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది.
మీనం
పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….


Share

Related posts

చరిత్రలో బ్రహ్మోత్సవాల నిర్వహణకోసం చేసిన దానాలు ఇవే !

Sree matha

అక్టోబర్ 2 – ఆశ్వయుజమాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma

కార్తీకంలో ఏడోరోజు నుచి పదిహేనో రోజు వరకు ఏం తినాలి? ఏం తినొద్దు ?

Sree matha