Daily Horoscope in Telugu మే 4 – గురువారం – వైశాఖమాసం – రోజు వారి రాశి ఫలాలు
మేషం : Aries Horoscope in Telugu May 4
నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. పుణ్య క్షేత్రాలు సందర్శించుకుంటారు.

వృషభం : Taurus Horoscope in Telugu May 4
ఉద్యోగస్తులు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్న అధిగమిస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి.
మిధునం : Gemini Horoscope in Telugu May 4
నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
కర్కాటకం : Cancer Horoscope in Telugu May 4
మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
సింహం : Leo Horoscope in Telugu May 4
వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.
కన్య : Virgo Horoscope in Telugu May 4
చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలోఅధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి.
తుల : Libra Horoscope in Telugu May 4
పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతనవాహనాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.
వృశ్చికం : Scorpion Horoscope in Telugu May 4
ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది ఆలోచనలు ఆచరణలో పెడతారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు.

ధనస్సు : Sagittarius Horoscope in Telugu May 4
ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తిచేస్తారు. పాత మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు కలలు నిజమవుతాయి.
మకరం : Capricorn Horoscope in Telugu May 4
వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి వృత్తి వ్యాపారాలలో. ఇతరులకు వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఆత్మీయుల సహాయ సహకారాలతో ఋణ సమస్యలు నుండి బయటపడతారు. ఉద్యోగస్తులకు అదనపుబాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.
కుంభం : Aquarius Horoscope in Telugu May 4
కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యక కొత్త సమస్యలు చోటుచేసుకుంటాయి. అవసరాలకి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు భాద్యతలు ఉంటాయి. చిన్నతరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు.
మీనం : Pisces Horoscope in Telugu May 4
అవసరానికి ధన సహాయం లభిస్తుంది. నూతన వస్త్రఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందారు.
నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….