NewsOrbit
Horoscope దైవం

Daily Horoscope: మే 1 – వైశాఖమాసం – రోజు వారి రాశి ఫలాలు

Daily Horoscope in Telugu April 19 2023 Rasi Phalalu
Share

Daily Horoscope in Telugu మే 1 – సోమవారం – వైశాఖమాసం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. దాయాదులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. అనారోగ్య సమస్యలు కొంత భాదిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

Daily Horoscope in Telugu April 19 2023
Daily Horoscope in Telugu May 1st 2023

వృషభం
సకాలంలో పూర్తి చెయ్యలేక ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన పనులు వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగమున గందరగోళ పరిస్థితులుంటాయి.
మిధునం
ఇంటా బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. ఊహించని విధంగా ఏర్పడిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సమాజంలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది. పాత ఋణాలు తీర్చడానికి చేసే నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది.
కర్కాటకం
కుటుంబ విషయాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు.
సింహం
ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ విషయమై దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమౌతాయి. వ్యాపారములలో ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.
కన్య
ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. బంధు మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వలన మానసికంగా స్థిమితం ఉండదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో అధికారులతో కొన్ని ఇబ్బందులు తప్పవు.
తుల
కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. గృహమునకు బందు మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. వస్తువులు బహుమతిగా పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది.
వృశ్చికం
వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక ఒడిడుకులు నుండి బయట పడతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు తొలగుతాయి.

Daily Horoscope in Telugu April 19 2023 Rasi Phalalu
Daily Horoscope in Telugu May 1st 2023 Rasi Phalalu

ధనస్సు
ముఖ్యమైన వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం కనిపించదు. బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. పాత బాకీలు తీర్చడానికి నూతన రుణయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిది కాదు. నిరుద్యోగులకు ఒక వార్త ఊరట కలిగిస్తుంది.
మకరం
కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిదికాదు. ప్రయాణాలు వాయిదా పడతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.
కుంభం
ప్రయాణాలలో నూతన పరిచయాలు ఆర్థిక లాభం కలిగిస్తాయి. గృహమున వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. స్ధిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి.
మీనం
స్థిరాస్తికి వివాదాలకు సంభందించి బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో …


Share

Related posts

Temple : గుడిలో  ప్రదక్షణలు లెక్కించడానికి పెన్ను ,పేపర్ వాడుతున్నారా?

siddhu

డిసెంబర్ 3 – మార్గ శిర మాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma

Today Horoscope: జూలై 10 – జ్యేష్ఠ మాసం – రోజు వారీ రాశి ఫలాలు

somaraju sharma