NewsOrbit
Horoscope దైవం

October 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? అక్టోబర్ 8 భాద్రపదమాసం రోజు వారి రాశి ఫలాలు!

daily-horoscope-aug-28th-2023-rasi-phalalu-nija-sravana-masam
Share

October 8: Daily Horoscope in Telugu అక్టోబర్ 8 – భాద్రపదమాసం – ఆదివారం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలుంటాయి.కొన్ని పనులలో శ్రమ తప్పదు. ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు తప్పవు. ఇంటాబయట ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

Daily Horoscope to start your day, August 7 2023 Daily Horoscope, August 7 Rasi Phalalu
Daily Horoscope to start your day October 8th 2023 Daily Horoscope October 8th Rasi Phalalu

వృషభం
ఉద్యోగమున సమస్యలు నుంచి బయటపడతారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది.
మిధునం
విద్యార్థులకు పరీక్ష ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది.

daily-horoscope-aug-28th-2023-rasi-phalalu-nija-sravana-masam
daily horoscope October 8th 2023 rasi phalalu Bhadrapadamasam

కర్కాటకం
సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
సింహం
చేపట్టిన పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార విస్తరణకు అవకాశములు అందుతాయి.

కన్య
స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. సన్నిహితులతో దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
తుల
మొండి బాకీలు వసూలవుతాయి. దాయదులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం పొందుతారు.

వృశ్చికం
బంధువులతో విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున నిరాశ తప్పదు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. మిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు. ఉదర సంభంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
ధనస్సు
కొన్ని వ్యవహారాలలో ఇతరులతో అప్రమత్తంగా వ్యవహారించాలి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. సోదరులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

మకరం
ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతవరణం ఉత్సాహంగా ఉంటుంది.
కుంభం
సోదరులతో స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.
మీనం
ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. ఉద్యోగయత్నాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని చికాకులు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయటా కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. దైవదర్శనాలు చేసుకుంటారు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….


Share

Related posts

New rules to visit Tirumala Tirupati..! All are not allowed

arun kanna

కార్తీక పురాణం విశేషాలు ఇవే !

Sree matha

సర్వభూపాల వాహనంలో శ్రీమలయప్పస్వామి !

Sree matha