NewsOrbit
Horoscope దైవం

September 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? సెప్టెంబర్ 11 నిజ శ్రావణమాసం రోజు వారి రాశి ఫలాలు!

daily-horoscope-aug-28th-2023-rasi-phalalu-nija-sravana-masam
Advertisements
Share

September 11: Daily Horoscope in Telugu సెప్టెంబర్ 11 – నిజ శ్రావణమాసం –సోమవారం – రోజు వారి రాశి ఫలాలు

Advertisements
Daily Horoscope to start your day, August 7 2023 Daily Horoscope, August 7 Rasi Phalalu
Daily Horoscope to start your day september 11 th 2023 Daily Horoscope september 11 th Rasi Phalalu

మేషం
నూతన ప్రయత్నాలు ముందుకు సాగవు. బంధువుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ప్రయాణాలలో మార్పులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది.
వృషభం
ముఖ్యమైన వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. సంతానానికి నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

Advertisements
daily-horoscope-aug-28th-2023-rasi-phalalu-nija-sravana-masam
daily horoscope september 10 th 2023 rasi phalalu nija sravana masam

మిధునం
దూరప్రయాణాలు వాయిదా పడతాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగడం మంచిది కాదు. ముఖ్య కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి.
కర్కాటకం
సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

సింహం
బంధుమిత్రులతో సేవా కార్యక్రమాలు చేపడతారు. స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో రాజీ చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగాలలో విలువైన పత్రాలు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
కన్య
ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం పొందుతారు.

తుల
ఇంటా బయట విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన వస్తులాభాలు పొందుతారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి కొంత ఉపశమనం పొందుతారు.
వృశ్చికం
చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. దూర ప్రయాణాలలో మార్గాలు అవరోధాలు కలుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు సాగిస్తారు. మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు కొంతమందికి స్థాయి ఉద్యోగాలలో మీకు రావలసిన గుర్తింపు వేరే వారికి వస్తుంది.

ధనస్సు
ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్పదు. దీర్ఘకాలిక రుణాల వలన ఒత్తిడి పెరుగుతుంది. అనుకున్న పనుల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఆలోచన తప్పదు. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.
మకరం
స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి. గృహమున బందు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. నూతన పరిచయాలు సంతోషాన్నిస్తాయి. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

కుంభం
సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి ధన సహాయం అందిస్తారు. చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
మీనం
కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు పెరుగుతుంది. పని ఒత్తిడి అధికమై శిరో బాధలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…


Share
Advertisements

Related posts

Today Horoscope: సెప్టెంబర్ 20 – భద్రపదమాసం – రోజువారీ రాశి ఫలాలు

somaraju sharma

Today Horoscope ఫిబ్రవరి – 23 – మాఘమాసం – మంగళవారం.సోదరుల నుంచి శుభవార్తలు !

Sree matha

ఆగస్టు 31 – బాద్రపదమాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma