September 20: Daily Horoscope in Telugu సెప్టెంబర్ 20 – భాద్రపదమాసం –బుధవారం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి తప్పవు.

వృషభం
ఆదాయం మరింత పెరుగుతుంది. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
మిధునం
విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అవరోధాలు అధిగమిస్తారు.

కర్కాటకం
ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు, మిత్రులతో విభేదాలు కలుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి.
సింహం
బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి.
కన్య
విద్యార్థులకు పరీక్ష ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తా. సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు. ద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు.
తుల
కుటుంబ సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. మిత్రులతో విభేదాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.
వృశ్చికం
అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. దూరపు బంధువుల నుండి శుభవర్తమానాలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
ధనస్సు
కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఉంటాయి.
మకరం
ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. పనులు సజావుగా సాగుతాయి. ఆప్తులు నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. ఉద్యోగుల కలలు సహకారం అవుతాయి.
కుంభం
ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
మీనం
మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలలో కష్టానికి ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. పని ఒత్తిడి అధికమవుతుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి.
నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…..