NewsOrbit
Featured Horoscope దైవం న్యూస్

Today Horoscope ఫిబ్రవరి – 24 – మాఘమాసం – బుధవారం.సమస్యల నుంచి బయటపడతారు !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope ఫిబ్రవరి – 24 – బుధవారం. శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, బుధవారం, తిథి: ద్వాదశి సాయంత్రం 6.05 వరకు తదుపరి త్రయోదశి, నక్షత్రం: పునర్వసు పగలు 1.17 వరకు తదుపరి శ్రవణం, వర్జ్యం: రాత్రి 9.17 నుండి 10.53 వరకు, అమృత ఘడియలు: ఉదయం 10.49 నుండి పగలు 12.28 వరకు, రాహుకాలం: పగలు 12.29 నుండి 1.57 వరకు, దుర్ముహూర్తం: పగలు 12.06 నుండి 12.53 వరకు.

మేష రాశి Today Horoscope ఫిబ్రవరి – 24 – మాఘమాసం – బుధవారం.ప్రయాణాలు అనుకూలిస్తాయి !

ఈరోజు బాగుంటుంది. పిల్లల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. పిల్లల కోరికలు తీరుస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పనికి తగ్గ ఫలితం కలుగుతుంది. ఆనందంగా ఉంటారు. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకొని సంతోషంగా ఉంటారు. చేపట్టిన ప్రతి పనిని అనుకున్న సమయానికి సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధువులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. వ్యాపారాలను విస్తరించు కుంటారు. కష్టపడడం వల్ల ఫలితం లభిస్తుంది. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు. సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు.

రెమిడీః లలిత అష్టోత్తర శత నామ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి Today Horoscope ఫిబ్రవరి – 24 – మాఘమాసం – బుధవారం.ధన నష్టం !

ఈరోజు అనుకూలంగా లేదు. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. రహస్యాలను బయటకు చెప్పడం వల్ల ఇబ్బందులు. అనవసరపు ఖర్చులు చేయడం వల్ల ధన నష్టం ఏర్పడుతుంది. వ్యాపారాల్లో క్రొత్త క్రొత్త అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి. అనుకున్న పనులను వాయిదాలు వేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ చూపకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇతరుల మీద ఆధార పడటం వల్ల ఇబ్బందులు. రాబోయే రోజుల గురించి ఆందోళన పడతారు. మీలో ఉన్న కోపం వల్ల, తొందరపాటు తనం వల్ల మీ ప్రాణ స్నేహితులు కూడా మిమ్మల్ని దూరం చేసుకుంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో చేసే పనిలో ఆటంకాలెదురవుతాయి.

రెమిడీః దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి Today Horoscope ఫిబ్రవరి – 24 – మాఘమాసం – బుధవారం.సమస్యల నుంచి బయటపడతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులను సమర్థవంతంగా సరైన సమయానికి పూర్తిచేస్తారు. ప్రమాదాల నుంచి, సమస్యల నుంచి బయటపడతారు. ఎదుటి వారిని అర్థం చేసుకుని సంతోషంగా ఉంటారు. అనవసరపు ఖర్చులు చేయకుండా ఉంటారు. డబ్బును పొదుపు చేస్తారు. ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగ పరచు కొంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి.

రెమిడీః లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చేసుకోండి.

 

కర్కాటక రాశి Today Horoscope ఫిబ్రవరి – 24 – మాఘమాసం – బుధవారం.రుణ బాధలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇష్టమైన వారి కోసం వచ్చిన అవకాశాలను వదులుకుంటారు. సమయానికి డబ్బులు చేతికి అందక పోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. రుణ బాధలు పెరిగిపోతాయి. ధననష్టం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఎదుటి వారితో విభేదాలు కలుగుతాయి. వాహన ప్రయాణం చేసేటప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు  కార్యాలయాల్లో అనుకోకుండా ఇష్టం లేని స్థానాలకు బదిలీ అవుతారు. స్నేహితులతో వాదోపవాదాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ చూపడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి.

రెమిడీః ఈరోజు సంకటహర గణపతిని ఆరాధించండి, దగ్గర్లో ఉన్న గణపతి ఆలయానికి వెళ్లి గరికను గణపతికి సమర్పించండి.

today february 24 daily horoscope in telugu
today february 24 daily horoscope in telugu

సింహరాశి Today Horoscope ఫిబ్రవరి – 24 – మాఘమాసం – బుధవారం.వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు !

ఈరోజు బాగుంటుంది. అన్ని రకాల సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. మిత్రులను కలుసుకుని ముఖ్యమైన విషయాలకు నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని చేసిన ఆలోచించి సమర్థవంతంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పౌష్టిక ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడు కుంటారు. అనుకున్న పనులను సమయానికి పూర్తిచేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. డబ్బు సంపాదించడానికి ఆసక్తి చూపుతారు. రహస్యాలు బయటకు చెప్పడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారుల మెప్పు పొందుతారు. వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు అనుకూలిస్తాయి.

రెమిడీః కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి Today Horoscope ఫిబ్రవరి – 24 – మాఘమాసం – బుధవారం.కార్యాలయాల్లో ఒత్తిడి !

ఈరోజు అనుకూలంగా లేదు. ప్రయాణాలకు అనుకూలం. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు శ్రద్ధ వహించడం మంచిది. తొందరపాటు తనం వల్ల బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. అప్పుల బాధలు పెరుగుతాయి. సమయానికి చేతికి డబ్బులు అండగా ఇబ్బందులు. ఆచార సాంప్రదాయాలకు దూరంగా ఉండటం వల్ల సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులను పక్కనపెట్టి అనవసరపు విషయాలను చర్చించడం వల్ల నష్టం కలుగుతుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోవడం వల్ల చదువు మీద అశ్రద్ధ చూపుతారు.  నూతన వ్యాపారాలు  అనుకూలించవు.

రెమిడీః దుర్గాదేవిని ఆరాధించండి.

 

తులారాశి Today Horoscope ఫిబ్రవరి – 24 – మాఘమాసం – బుధవారం.వ్యాపారాలు అనుకూలిస్తాయి !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉంటారు. ఏలాంటి కష్టమైనా సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అనుకున్న సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. రుణ బాధలు తీరుతాయి. ధన యోగం కలుగుతుంది. సమస్యలు తీరిపోయి ప్రశాంతంగా ఉంటారు.

రెమిడీః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి Today Horoscope ఫిబ్రవరి – 24 – మాఘమాసం – బుధవారం.మానసిక వేదనకు గురవుతారు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. తప్పని పరిస్థితుల్లో తప్పులు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. మీరు పడ్డ శ్రమను ఎదుటివారు గుర్తించక పోవడం వల్ల ఈర్ష్యాద్వేషాలు పెరుగుతాయి. తొందరపాటు తనం వల్ల నష్టం ఏర్పడుతుంది. విద్యార్థులు చదువు మీద ఆసక్తి చూపకుండా అనవసర విషయాలను పట్టించుకోని మానసిక వేదనకు గురవుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి.

రెమిడీః కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

 

ధనస్సు రాశి Today Horoscope ఫిబ్రవరి – 24 – మాఘమాసం – బుధవారం.ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. ఎలాంటి క్లిష్టమైన సమస్య అయినా ధైర్యంగా ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటారు. మీరంటే ఇష్టపడే బంధువులు మిమ్మల్ని కలుసుకుంటారు. సమాజంలో కీర్తి పొందుతారు. ఇతరులకు సహాయం చేయడానికి ఆసక్తి చూపుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు కలుగుతాయి. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. ధన లాభం కలుగుతుంది. బంధువుల నుంచి అనుకోకుండా శుభవార్తలు వింటారు. స్నేహితులను కలుసుకుంటారు. ఆనందంగా ఉంటారు. వాహన కొనుగోలు చేస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి.

రెమిడీః ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.

 

మకర రాశి Today Horoscope ఫిబ్రవరి – 24 – మాఘమాసం – బుధవారం.పెట్టుబడులు అనుకూలించవు !

ఈరోజు అనుకూలంగా లేదు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు, స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. అనవసరపు వస్తువుల కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువవుతుంది. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఎదుటివారు మిమ్మల్ని తప్పు పడతారు. ముఖ్యమైన విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం ఏర్పడుతుంది. కుటుంబంలో సఖ్యత కోల్పోతారు. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. విద్యార్థులు చదువు మీదనే శ్రద్ధ వహించడం మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి.

రెమిడీః దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి Today Horoscope ఫిబ్రవరి – 24 – మాఘమాసం – బుధవారం.ఖర్చులకు దూరంగా ఉంటారు !

ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. ధన యోగం కలుగుతుంది. వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గొప్ప హోదాలను పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. అనారోగ్య సమస్యలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు.

రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

 

మీన రాశి Today Horoscope ఫిబ్రవరి – 24 – మాఘమాసం – బుధవారం.ఎదుటి వారు మోసం చేస్తారు !

ఈరోజు అనుకూలంగా లేదు. గతంలో మిమ్మల్ని ఇష్ట పడిన వారు తిరిగి దూరమవుతారు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. మానసిక వేదనకు గురవుతారు. ఎదుటి వారు మంచిగా మాట్లాడి మోసం చేస్తారు. విలువైన బంగారు ఆభరణాలను జాగ్రత్తగా చేసుకోకపోవడం వల్ల ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునే అప్పుడు పెద్ద వారితో ఆలోచించి తీసుకోవడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. వ్యాపారాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. విద్యార్థులు మానసిక వత్తిడికిలోనై చదువు మీద ఆశ్రద్ధ చూపుతారు.

రెమిడీః ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N