NewsOrbit
Horoscope దైవం న్యూస్

Today Horoscope ఫిబ్రవరి – 27 – మాఘమాసం – శనివారం.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు !

Today Horoscope ఫిబ్రవరి – 27 – మాఘమాసం – శనివారం. శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, శనివారం, తిథి: పూర్ణిమ పగలు 1.46 వరకు తదుపరి పాడ్యమి, నక్షత్రం: మఘ ఉదయం 11.17 వరకు, తదుపరి పూర్వ ఫల్గుణి, వర్జ్యం: సాయంత్రం 6.44 నుండి రాత్రి 8.13 వరకు, అమృత ఘడియలు: ఉదయం 9.02 నుండి 10.33 వరకు, రాహుకాలం: ఉదయం 9.32 నుండి 11.01 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 6.36 నుండి 8.10 వరకు.

మేష రాశి Today Horoscope ఫిబ్రవరి – 27 – మాఘమాసం – శనివారం.ఆర్ధిక నష్టం !

ఈరోజు అనుకున్న పనులను వాయిదా వేస్తారు. ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాలు అనుకూలము వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. మీలో ఉన్న కోపం వల్ల, చికాకు వల్ల మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. కుటుంబ సభ్యులతో విభేదాలు. అనవసరపు విషయాలను చర్చించడం వల్ల అనర్ధాలు కలుగుతాయి. తక్కువ మాట్లాడడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పై అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. రుణ బాధలు పెరుగుతాయి. అనవసరపు ఖర్చులు చేస్తారు. ఆర్ధిక నష్టం జరుగుతుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు. తొందరపడి తెలియని వ్యక్తులను నమ్మడమెల్ల నష్టం జరుగుతుంది. తొందరపడి డబ్బు సంపాదించాలని అనవసరపు ఆలోచనలు వల్ల అవమానాలు ఎదురవుతాయి. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. వ్యాపారాల్లో కష్టాలు.

రెమిడీః శివాష్టకం పారాయణం చేయండి.

 

వృషభ రాశి Today Horoscope ఫిబ్రవరి – 27 – మాఘమాసం – శనివారం.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎదుటివారి నుంచి మంచిచెడులు తెలుసుకుంటారు. మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. దైవభక్తి పెరుగుతుంది. సమాజసేవ చేయాలని తపన పడతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా, సఖ్యతగా ఉంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. పెద్ద వారిని గౌరవిస్తారు, వారి సూచనలను పాటిస్తారు. స్థిరాస్తులు సంక్రమిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. మనసులో ఉన్న బాధలను, విషయాలను కుటుంబ సభ్యులతో చర్చించుకొని సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో మంచి మంచి అవకాశాలను అందుకుంటారు. ధర్మానికి, నీతి నిజాయితీకి ప్రాధాన్యతనిస్తారు.

రెమిడీః ఈరోజు మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి Today Horoscope ఫిబ్రవరి – 27 – మాఘమాసం – శనివారం.తప్పుడు నిర్ణయాల వల్ల సమస్యలు !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. మీలో ఉన్న మొండి పట్టుదల వల్ల కావలసిన వారిని దూరం చేసుకుంటారు. ఏ విషయంలోనైనా గర్వంతో, అహంకారంతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు కలుగుతాయి. తప్పుడు నిర్ణయాల వల్ల సమస్యలు ఎదురవుతాయి. అనవసరపు ఖర్చులు చేయడం వల్ల సమయానికి చేతికి డబ్బులు అందక పోవడం వల్ల ఇబ్బందులు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయగా వాయిదా వేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. రాబోయే రోజుల గురించి దీర్ఘాలోచన చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల వల్ల చికాకులు ఏర్పడతాయి. విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకుంటారు, చదువు విషయంలో అశ్రద్ధ గా ఉంటారు.

రెమిడీః ఈరోజు దుర్గా దేవిని ఆరాధించండి.

 

కర్కాటక రాశి Today Horoscope ఫిబ్రవరి – 27 – మాఘమాసం – శనివారం.వ్యాపారాలు అనుకూలిస్తాయి !

ఈ రోజు బాగుంటుంది. అందరితో సఖ్యతగా, సన్నిహితంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు, పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మిత్రుల సహకారం పొందుతారు. స్నేహితుల కోసం కష్టపడతారు. మీ వాక్చాతుర్యం వల్ల అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. మీలో ఉన్న కోపాన్ని తగ్గించుకుని ఏ పనినైనా ప్రశాంతంగా ఆలోచించి చేపడతారు. ఎదుటివారు చేసిన తప్పుల, లోపాలను సరిదిద్దుతారు సమాజ సేవ చేయడానికి ఆసక్తి చూపుతారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లాభం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి.

రెమిడీః అన్నపూర్ణ అష్టకం పారాయణం చేసుకోండి.

today february 27 daily horoscope in telugu
today february 27 daily horoscope in telugu

సింహరాశి Today Horoscope ఫిబ్రవరి – 27 – మాఘమాసం – శనివారం.ప్రశాంతత కోల్పోతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. మితమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. ప్రశాంతత కోల్పోతారు. మీరంటే ఇష్టపడే వారిని దూరం చేసుకుంటారు. రుణబాధలు పెరిగిపోయి ధననష్టం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో వచ్చిన అవకాశాలను వదులుకుంటారు. ఏ విషయంలోనైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి.

రెమిడీః హనుమాన్ చాలీసా పారాయణం  చేసుకోండి.

 

కన్యారాశి Today Horoscope ఫిబ్రవరి – 27 – మాఘమాసం – శనివారం.ప్రయాణాలు అనుకూలిస్తాయి !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. ఎంత క్లిష్టమైన విషయాల్లో అయినా ధైర్యంగా  సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. వాహనాల కొనుగోలు అనుకూలిస్తుంది. అన్ని సమస్యలకు పరిష్కారాన్ని వెతుకుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. ఆర్థిక లాభం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.

రెమిడీః ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

 

తులారాశి Today Horoscope ఫిబ్రవరి – 27 – మాఘమాసం – శనివారం.స్నేహితులతో విభేదాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. ఎదుటివారితో మొహమాట పడకుండా మాట్లాడటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. స్నేహితులతో విభేదాలు కలుగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు. అప్పులు ఇవ్వడం, తీసుకోకపోవడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. అనుకున్న పనులను ఇష్టపడి శ్రద్ధ పెట్టి చేయకపోవడం వల్ల నష్టాలు కలుగుతాయి. అనుకున్న లక్ష్యాలు నెరవేర్చు కోలేక మానసిక వేదనకు గురవుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు చదువులో అశ్రద్ధ చేసి అనవసరపు విషయాలను పట్టించుకోవడం వల్ల నష్టపోతారు.

రెమిడీః నవగ్రహారాధన చేసుకోండి, దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లి నవగ్రహాలకు ఇరవై ఒక్క ప్రదక్షణాలు చేయండి.

 

వృశ్చిక రాశి Today Horoscope ఫిబ్రవరి – 27 – మాఘమాసం – శనివారం.స్థిరాస్తులు అనుకూలిస్తాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని ఎక్కువగా గడుపుతారు. అందరితో కలిసి మెలిసి ఉంటారు. అనుకున్న విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. రుణ బాధలు తీరిపోతాయి. అవసరానికి డబ్బులు అందుతాయి. ధన లాభం కలుగుతుంది. ధర్మానికి, న్యాయానికి, ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకొని అనారోగ్యాలను తగ్గించుకుంటారు.

రెమిడీః షట్పది స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

ధనస్సు రాశి Today Horoscope ఫిబ్రవరి – 27 – మాఘమాసం – శనివారం.పిల్లల విషయంలో జాగ్రత్త !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. దంపతుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. రాబోయే రోజుల గురించి ఆలోచించి దీర్ఘకాలిక పెట్టుబడులు పెడతారు. వివాహ సంబంధ విషయాలు అనుకూలించవు. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అనుకున్న పనులను వాయిదా వేయటం వల్ల నష్టం కలుగుతుంది. ఉద్యోగస్తుల కార్యాలయంలో పని ఒత్తిడి వల్ల ప్రశాంతత కోల్పోతారు. వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల నష్టాలు కలుగుతాయి. పిల్లల విషయంలో జాగ్రత్త, శ్రద్ధ తీసుకోక పోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులు చదువును అశ్రద్ధ చేస్తారు.

రెమిడీః ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మకర రాశి Today Horoscope ఫిబ్రవరి – 27 – మాఘమాసం – శనివారం.లక్ష్యాలను సాధిస్తారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీ కోసం కంటే ఎదుటివారి కోసం కష్టపడతారు. వాదోపవాదాలకు దూరంగా ఉంటారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసి విజయం పొందుతారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. మీలో ఉన్న మొండితనం వల్ల అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. నిజాయితీగా, క్రమశిక్షణగా ఉంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఉన్నత హోదాలను అందుకుంటారు. స్త్రీలకు వస్తు లాభం కలుగుతుంది.

రెమిడీః దక్షిణామూర్తిని ఆరాధించండి.

 

కుంభరాశి Today Horoscope ఫిబ్రవరి – 27 – మాఘమాసం – శనివారం.కార్యాలయాల్లో ఇబ్బందులు !

మీలో ఉన్న కోపం వల్ల, తొందరపాటు తనం వల్ల ఎవరైతే మిమ్మల్ని ఇష్టపడతారు వారికి దూరమవుతారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. ఆప్తమిత్రులతో దూరంగా ఉంటారు. సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యమైన విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు. ముఖ్యమైన పనుల లో జ్ఞాపక శక్తి కోల్పోతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. విలువైన వస్తువులను ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంది. ఇష్టంలేని పనులు చేయడం వల్ల ఇబ్బంది. అవసరానికి చేతికి డబ్బులు అండగా ధననష్టం కలుగుతుంది. కార్యాలయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు సోమరితనం వల్ల చదువును నిర్లక్ష్యం చేస్తారు.

రెమిడీః విశ్వనాథ అష్టకం పారాయణం చేసుకోండి.

 

మీన రాశి Today Horoscope ఫిబ్రవరి – 27 – మాఘమాసం – శనివారం.ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు !

ఈరోజు బాగుంటుంది. అందరితో సంతోషంగా, సఖ్యతగా ఉంటారు. పరువు ప్రతిష్టలకు, ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. చేపట్టిన ప్రతి పనులన్నీ శ్రద్ధగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విహార యాత్రలు చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది. అనుకున్న లక్ష్యాలను సాధించడానికి కష్ట పడతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు, ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు, సాంకేతిక విద్య లకు శ్రద్ధ చూపుతారు.

రెమిడీః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?