Today Horoscope: మే 10 – చైత్రమాసం – రోజవారీ జాతక ఫలాల

Share

Today Horoscope: మే 10 – చైత్రమాసం – సోమవారం

మేషం

వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు.ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఇళ్లు,  స్థలాల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి.రియల్ ఎస్టేట్ల వారికి నూతనోత్సాహం. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు.ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కుతాయి.పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సత్కారాలు. ఐటీ నిపుణులకు వివాదాల నుంచి విముక్తి. విద్యార్థుల యత్నాలు సఫలం. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం.  షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు…పసుపు, గులాబీ.

రెమిడీ..హనుమాన్ చాలీసా పఠించండి.

Today Horoscope
Today Horoscope

వృషభం

ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. రాబడికి మించి ఖర్చులు. మిత్రులతో తగాదాలు. కుటుంబ బాధ్యతలతో సతమతమవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ల వారికి చిక్కులు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగులకు చికాకులు అధికమవుతాయి. కళాకారులు, ఐటీ నిపుణులకు ఒడిదుడుకులు. విద్యార్థులకు కొద్దిపాటి సమస్యలు. మహిళలు ఆరోగ్యవిషయంలో మెలకువ పాటించాలి. షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

అదృష్ట రంగులు…కాఫీ, తెలుపు.

రెమిడీ.. విష్ణు ధ్యానం చేయండి.

 

మిథునం

నూతన కార్యక్రమాలు ప్రారంభం. బంధువుల నుంచి వర్తమానాలు. వాహనసౌఖ్యం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. రియల్ ఎస్టేట్లు వారికి అనుకూల సమాచారం. వ్యాపారాలు అభివద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, రాజకీయవర్గాలకు పట్టింది బంగారమే. విద్యార్థులకు ఫలితాలు అనుకూలిస్తాయి. మహిళలకు కొన్ని సమస్యలు తీరతాయి.

అదృష్ట రంగులు…గోధుమ, గులాబీ.

రెమిడీ ..వేంకటేశ్వరస్వామిని పూజించండి.

 

కర్కాటకం

పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో మరింత గౌరవప్రతిష్ఠలు. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు. కొత్త వ్యక్తులతో పరిచయాలు. రియల్ ఎస్టేట్ల వారికి కొంత అనుకూల పరిస్థితులు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాల్లో పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులకు చిక్కులు తొలగుతాయి. విద్యార్థుల శ్రమ కొంత ఫలిస్తుంది. మహిళలకు ఆస్తిలాభాలు. షేర్ల విక్రయాలులాభిస్తాయి.

అదృష్ట రంగులు…ఆకుపచ్చ, నీలం.

రెమిడీ.. దత్తాత్రేయున్ని పూజించాలి.

 

సింహం

ఆర్థిక వ్యవహారాల్లో ఆటుపోట్లు. సన్నిహితులతో విభేదాలు. కష్టించినా ఫలితం కనిపించదు. ఆలయాల సందర్శనం. రియల్ ఎస్టేట్లు ఒత్తిడులు. వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు. రాజకీయవేత్తలు, కళాకారులకు కొత్త సమస్యలు. ఐటీ నిపుణులు బాధ్యతల విషయంలో మెలకువ పాటించాలి. విద్యార్థులకు గందరగోళం. మహిళలు కుటుంబ సమస్యలు ఎదుర్కొంటారు. షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు…పసుపు, ఆకుపచ్చ.

రెమిడీ ..శివాలయ ప్రదక్షణలు చేయండి.

 

కన్య

దూర ప్రయాణాలు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. భార్యాభర్తల మధ్య అకారణ విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. రియల్ ఎస్టేట్ల వారికి కొన్ని ఇబ్బందులు. వ్యాపారులకు లాభాలు అనుమానమే. ఉద్యోగాల్లో మార్పులు సంభవం. రాజకీయవేత్తలు, ఐటీ నిపుణులకు గందరగోళం. విద్యార్థులు ఆచితూచి ముందుకు సాగాలి. మహిళలకు నిరుత్సాహం. షేర్ల విక్రయాలలో స్వల్ప లాభాలు.

అదృష్ట రంగులు… తెలుపు, కాఫీ.

రెమిడీ ..గణేశ్ శ్లోకాలు పఠించాలి.

 

తుల

ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి కాగలవు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య అపోహలు, అపార్థాలు తొలగి ఊరట లభిస్తుంది. ప్రముఖుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. కొన్ని బాకీలు కొన్ని వసూలవుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఉద్యోగాల్లో ఉన్నత స్థితి లాభిస్తుంది. వ్యాపారులకు ఊహించని  లాభాలు. కళాకారులకు కీలక సమాచారం. ఐటీ నిపుణులకు ముఖ్య సమాచారం రాగలదు. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు రావచ్చు. మహిళలకు శుభవర్తమానాలు. షేర్ల విక్రయాలలో లాభాలు.

అదృష్ట రంగులు…గోధుమ, ఆకుపచ్చ.

రెమిడీ..దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

 

వృశ్చికం

దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అందుతుంది. అప్రయత్న కార్యసిద్ధి. పాత విషయాలు గుర్తుకు వస్తాయి. సోదరీలతో కష్టసుఖాలు పంచుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ల వారికి కొత్త ఆశలు. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారుల యత్నాలు సఫలం. ఐటీ నిపుణులకు వివాదాలు సర్దుకుంటాయి.  మహిళలకు కుటుంబసమస్యలు తీరతాయి. షేర్ల విక్రయాలలో లాభాలు.

అదృష్ట రంగులు…కాఫీ,ఎరుపు.

రెమిడీ..శివ స్తోత్రాలు పఠించాలి.

 

ధనుస్సు

అనుకోని ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. శ్రమాధిక్యం. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు. బంధువులతో అకారణంగా తగాదాలు. శారీరకపరమైన రుగ్మతలు. కాంట్రాక్టర్లకు నిరాశాజనకమే. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులకు ఒడిదుడుకులు. విద్యార్థులకు నిరాశ. మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. షేర్ల విక్రయాలలో ఆలోచించి ముందుకు సాగండి.

అదృష్ట రంగులు…ఎరుపు, పసుపు.

రెమిడీ.,సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

 

మకరం

ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కొన్ని పనులు ముందుకు సాగవు. శారీరకపరంగా రుగ్మతలు బాధిస్తాయి. కాంట్రాక్టర్లు, రియల్ఎస్టేట్ల వారికి ఒత్తిడులు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. పారిశ్రామికవేత్తలకు అంచనాలు తప్పుతాయి. ఐటీ నిపుణులకు అంచనాలలో పొరపాట్లు. విద్యార్థులకు కొన్ని సమస్యలు తప్పవు. మహిళలకు నిరుత్సాహం. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు…పసుపు, గోధుమ.

రెమిడీ.. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

 

కుంభం

ఆదాయం మరింత సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాట సాయం అందుతుంది. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దైవకార్యాలలో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ల వారికి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి. ఐటీ నిపుణులు, కళాకారులకు నూతనోత్సాహం. మహిళలకు శుభ వర్తమానాలు. షేర్ల విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

అదృష్ట రంగులు…గోధుమ, పసుపు.

రెమిడీ.. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

 

మీనం

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులు, సోదరులతో   మాటపట్టింపులు. శ్రమ మరింత పెరుగుతుంది. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. ఇంటాబయటా బాధ్యతలు. దూర ప్రయాణాలు సంభవం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు బదిలీలు సంభవం. పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులకు నిరాశ. విద్యార్థులకు ఒడిదుడుకులు. మహిళలు కుటుంబసమస్యలు ఎదుర్కొంటారు. షేర్ల విక్రయాలు నిరాశ పరుస్తాయి.

అదృష్ట రంగులు…ఆకుపచ్చ, గోధుమ,

రెమిడీ..హనుమాన్చాలీసా పఠించండి.


Share

Related posts

శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు – 2020 వాహ‌న‌సేవ‌లు

Sree matha

Today Horoscope ఏప్రిల్-4- పాల్గుణ మాసం –ఆదివారం.పోటీపరీక్షల్లో విజయం పొందుతారు !

Sree matha

Today Horoscope ఫిబ్రవరి – 27 – మాఘమాసం – శనివారం.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు !

Sree matha