Today Horoscope: మే 27 – వైశాఖ మాసం – రోజువారీ రాశి ఫలాలు

Share

Today Horoscope: మే 27 – గురువారం – వైశాఖ మాసం

మేషం

ఆలోచనలు కలసివస్తాయి. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆప్తుల నుంచి శుభవార్తలు. శుభకార్యాలకు ఎక్కువగా డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి కొత్త ఆశలు. కళాకారులకు శుభవార్తలు. విద్యార్థులకు పరిశోధనలు ఫలిస్తాయి. మహిళలకు వస్తు, వస్త్రలాభాలు. షేర్ల విక్రయాలలో అనుకున్న లాభాలు.

అదృష్ట రంగులు….ఆకుపచ్చ, గోధుమ.

రెమిడి.. దుర్గాదేవిని పూజించండి.

Today Horoscope
Today Horoscope

వృషభం :

బంధువుల నుంచి ప్రోత్సాహం. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి. ఉద్యోగాల్లో చికాకులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు. కళాకారులకు నూతనోత్సాహం. విద్యార్థులకు అనుకోని విద్యావకాశాలు. మహిళలకు సోదరుల నుంచి సహాయం అందుతుంది. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు…. పసుపు, ఆకుపచ్చ.

రెమిడి.. గణపతికి అర్చన చేయండి.

మిథునం

అనుకున్న సొమ్ము అందక రుణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయటా సమస్యలు సహనాన్ని పరీక్షిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. సన్నిహితుల నుంచి లేనిపోని వివాదాలు. చర్మసంబంధిత రుగ్మతలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. రాజకీయవర్గాల వారికి చిక్కులు. కళాకారులకు అంచనాలలో పొరపాట్లు. విద్యార్థులకు శ్రమాధిక్యం. మహిళలకు మానసిక ఆందోళన. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు….ఎరుపు, తెలుపు.

రెమిడి.. దత్తాత్రేయున్ని పూజించాలి.

కర్కాటకం

కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్య భంగం, ఔషధ సేవనం. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. పెట్టుబడులు అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగులకు విధుల్లో ఒడిదుడుకులు. రాజకీయ, సాంకేతిక రంగాల వారికి ప్రత్యర్థుల నుంచి సమస్యలు. కళాకారులకు ప్రయత్నాలు అనుకూలించవు. విద్యార్థులకు అవకాశాలు చేజారతాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు. షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.

అదృష్ట రంగులు…. పసుపు, ఆకుపచ్చ.

రెమిడి.. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

సింహం

ముఖ్య పనులకు కుటుంబ సభ్యులు సహకరిస్తారు. కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రేయోభిలాషుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు శుభవార్తలు. కళాకారుల యత్నాలు సఫలం. విద్యార్థులకు అరుదైన అవకాశాలు లభించే సమయం. మహిళలకు ఆభరణ ప్రాప్తి. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు….గులాబీ, బంగారు.

రెమిడి.. ఆంజనేయ దండకం పఠించండి.

కన్య

ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. కొత్తగా రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలలో అవరోధాలు. పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి విషయంలో బంధువులతో తగాదాలు. ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఉద్యోగులకు స్థాన చలనం ఉండవచ్చు. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి ఒత్తిడులు. కళాకారులకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులు అనుకున్న అవకాశాలు చేజార్చుకుంటారు. మహిళలకు కుటుంబ సమస్యలు. షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.

అదృష్ట రంగులు…. నీలం, ఆకుపచ్చ.

రెమిడి.. ఆంజనేయస్వామిని పూజించండి.

తుల

ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ధన లాభం. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పదిమందిలోనూ గౌరవం పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. గృహం, వాహనాలు సమకూర్చుకుంటారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు. కళాకారులకు నూతనోత్సాహం. రాజకీయ, సాంకేతిక రంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు శుభ వర్తమానాలు. షేర్ల విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

అదృష్ట రంగులు…. ఎరుపు, తెలుపు.

రెమిడి.. ఆదిత్య హృదయం పఠించండి.

వృశ్చికం

ముఖ్య కార్యక్రమాలు వాయిదా. శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. బంధువుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు నత్తనడకనే సాగుతాయి. ఉద్యోగాల్లో కొన్ని మార్పులు ఉంటాయి. రాజకీయ, వైద్య రంగాల వారికి వ్యవహారాలు అనుకూలించవు. కళాకారులకు అవకాశాలు తప్పిపోతాయి. విద్యార్థులకు అసంతృప్తి నెలకొంటుంది. మహిళలకు అనారోగ్య సూచనలు. షేర్ల క్రయవిక్రయాలు నిరాశ కలిగిస్తాయి.

అదృష్ట రంగులు…. ఆకుపచ్చ, నీలం.

రెమిడి.. శివ స్తోత్రాలు పఠించాలి.

ధనుస్సు

పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. బంధువులతో వివాదాల పరిష్కారం. ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. తీర్థ యాత్రలు చేస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాల విస్తరణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. పారిశ్రామిక, వైద్య రంగాల వారు అనుకున్నది సాధిస్తారు. కళాకారులకు పురస్కారాలు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు దక్కుతాయి. మహిళలకు ఆస్తి లాభం. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు…. పసుపు, గోధుమ.

రెమిడి.. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

మకరం

అనుకున్న సొమ్ము అందక రుణాలు చేయాల్సి ఉంటుంది. ఇంటా బయటా సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు రావచ్చు.  సన్నిహితుల నుంచి లేనిపోని తగాదాలు. చర్మసంబంధిత రుగ్మతలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. రాజకీయవర్గాల వారికి చిక్కులు. కళాకారులకు అంచనాలలో పొరపాట్లు. విద్యార్థులకు శ్రమాధిక్యం. మహిళలకు మానసిక ఆందోళన. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు….ఎరుపు, తెలుపు.

రెమిడి.. దత్తాత్రేయున్ని పూజించాలి.

కుంభం

దూర ప్రయాణాలు. కొన్ని కార్యక్రమాలు మధ్యలోనే విరమిస్తారు. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. నిరుద్యోగులకు భవిష్యత్పై కొత్త ఆశలు చిగురిస్తాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు అనుకూలించవు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటుపోట్లు. రాజకీయ, వైద్యరంగాల వారికి అంచనాలు తప్పుతాయి. విద్యార్థులు అనుకున్న విద్యావకాశాలు చేజార్చుకుంటారు. మహిళలకు కుటుంబ సమస్యలు. షేర్ల విక్రయాల్లో లాభాలు ఉండవు.

అదృష్ట రంగులు….ఆకుపచ్చ, గోధుమ.

రెమిడి.. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

మీనం

పనులు కొన్ని మధ్యలో విరమిస్తారు. అనారోగ్య సూచనలు. కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు. భార్యాభర్తల మధ్య విభేదాలు. ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. వ్యాపారాలు మందగిస్తాయి, అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి మానసిక అశాంతి. కళాకారులకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకున్న అవకాశాలు కాకుండా వేరే దక్కేసూచనలు. మహిళలకు నిరుత్సాహం. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….తెలుపు, గోధుమ.

రెమిడి.. గణపతిని ఆరాధించండి.


Share

Related posts

Today Horoscope అక్టోబర్ 15th గురువారం మీ రాశి ఫలాలు

Sree matha

అలంపూర్‌ జోగులాంబ శక్తిపీఠ విశేషాలు ఇవే !

Sree matha

Today Horoscope డిసెంబర్ 2nd బుధవారం రాశి ఫలాలు

Sree matha