Today Horoscope: ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope
Share

Today Horoscope: ఆగస్టు 19 – గురువారం – శ్రావణమాసం

మేషం

ఆదాయ మార్గాలు తగ్గుతాయి. నూతన ఋణ ప్రయత్నాలుచేస్తారు. చేపట్టినపనులు మందకొడిగా సాగుతాయి. చుట్టుపక్కల వారితో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమంలో పాల్గొంటారు.

Today Horoscope
Today Horoscope

వృషభం

స్ధిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలలో  అంచనాలు అందుకోలేరు. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. దూర ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాలి.

మిధునం

దైవ సంభందిత విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో పెద్దలతో  పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లబిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు  తొలగుతాయి. కుటుంబ సభ్యులతో సమస్యలు పరిష్కారమౌతాయి.

కర్కాటకం

వృత్తి ఉద్యోగమున  బాధ్యతలు సమర్ధవంతగా నిర్వహిస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి .చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. బంధువుల నుంచి శుభ వర్తమానాలు అందుతాయి. నూతన వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహకరవాతావరణం ఉంటుంది.

సింహం

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృధా ధనవ్యయ  సూచనలు ఉన్నాయి.  బంధు మిత్రులతో ఆకస్మిక కలహా సూచనలున్నవి. ఉద్యోగ విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి.

కన్య

ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి చేపట్టిన పనుల్లో ప్రతిబంధకలుంటాయి. ఒక వ్యవహారంలో  మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. వృత్తి ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి.

తుల

ఆప్తుల నుండి కీలక విషయాలు తెలుస్తాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. భూ సంభందిత క్రయ విక్రయాలలో తగిన లాభాలు పొందుతారు. ఉద్యోగ విషయంలో అధికారులతో సంప్రదింపులు చేస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశములు లభిస్తాయి.

వృశ్చికం

కుటుంబ వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది వృధా ఖర్చులు పెరుగుతాయి. ఊహించని దూర ప్రయాణాలు వలన శారీరకశ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఇతరుల వలన ఇబ్బందులు కలుగుతాయి. నేత్ర సంభందిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

ధనస్సు

గృహమున కొంత మంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటాయి. చిన్న నాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నపటికీ సమర్దవంతంగా పూర్తిచేస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

మకరం

ముఖ్యమైన వ్యవహారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఋణ దాతల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. వృత్తి, ఉద్యోగాలలో స్థాన చలన సూచనలున్నవి.

కుంభం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం. పాత మిత్రులను కలుసుకుని పాత విషయాలు గూర్చి చర్చిస్తారు. అధికారులతో  పరిచయాలు విస్తృత మవుతాయి. కుటుంబ సమస్యలు తొలగి కొంత ఊరట చెందుతారు. వ్యాపారాలలో నూతన  ప్రణాళికలు అమలు చేస్తారు. ఆకస్మికంగా ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సహకాలు అందుకుంటారు.

మీనం

నిరుద్యోగులకు ఆశించిన అవకాశలు అందుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున మీ ప్రతిభకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. స్ధిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతంగా సాగుతాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

 


Share

Related posts

హనుమంతుడి సీక్రెట్ పెళ్లి గురించి మనకి తెలియని విషయం !

Kumar

Lord Shiva: ఇటువంటి మహిమ గల శివలింగాన్ని హిమాచల్ లోనే చూడగలరు!! అందుకే ఈ ఆలయానికి అంతా విశిష్టత !!

Naina

Daily Horoscope జూలై 5 ఆదివారం మీ రాశి ఫలాలు

Sree matha