Today Horoscope: సెప్టెంబర్ 2 – గురువారం – శ్రావణమాసం
మేషం
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తిచేస్తారు. ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుంచి స్థిరస్తి లాభాలుంటాయి. వృత్తి ఉద్యోగాలు సంతృప్తి కరంగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి.
వృషభం
కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి ఆకస్మిక దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలలో తొందరపడి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. నేత్ర సంభంధిత ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవ చింతన కలుగుతుంది.
మిధునం
ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది గృహమున ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహన వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సంఖ్యత కలుగుతుంది ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
కర్కాటకం
అవసరానికి ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి భాగస్వామ్య వ్యాపారాలలో నూతన లాభాల అందుకుంటారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
సింహం
కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి.ధనదాయం బాగుంటుంది దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు వృత్తి ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.
కన్య
చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన. ధైర్యంగా పనులను పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి భూ క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.
తుల
సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థాణాచలానాలుంటాయి. వ్యాపారపరంగా ఎదురైనా అవరోధాలను అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు కొంత ఆశజానాకంగా ఉంటాయి. దూర ప్రాంతాల బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
వృశ్చికం
దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమై మానసిక ప్రశాంతత పొందుతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. స్థిరస్తి క్రయవిక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సోదరుల నుండి ఊహించని ఆర్ధిక సహాయం అందుతుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
ధనస్సు
సన్నిహితుల నుండి విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక రుణాలు నుండి బయట పడతారు. వ్యాపారములు అనుకూలంగా సాగుతాయి.
మకరం
దీర్ఘ కాలిక సమస్యలు నుండి బయట పడతారు. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను ప్రారంబించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది.
కుంభం
నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది సంతాన విద్యా వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
మీనం
చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలను కలసివస్తాయి. ముఖ్యమైన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.
నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…