Today Horoscope: సెప్టెంబర్ 4 – శ్రావణ మాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope:
Share

Today Horoscope: సెప్టెంబర్ 4 – శనివారం – శ్రావణ మాసం

మేషం
కుటుంబ సభ్యుల సహాయం తో చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయం కలుగుతాయి. చిన్ననాటి మిత్రులకు ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్థులతో వివాదాలు నుండి కొంత వరకు బయటపడగలుగుతారు.

Today Horoscope:
Today Horoscope:

వృషభం
ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులను అధిగమిస్తారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. బంధుమిత్రుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగం అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు.
మిధునం
గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఒక వ్యవహరంలో సమాజంలో పేరు కలిగిన వారి సహాయంతో కార్యసిద్ధి కలుగుతుంది వృత్తి వ్యాపారాలలో ఆకస్మిక లాభాలు పొందుతారు. విలువైన, వస్త్ర, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
కర్కాటకం
చేపట్టిన పనులు పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థికపరిస్థితి కొంత అనుకూలంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన అవరోధాలు అధిగమించి స్వల్ప లాభాలను అందుకుంటారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణతో పదోన్నతులు పెరుగుతాయి. గృహమున సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
సింహం
సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపార విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
కన్య
సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్ధిక సమస్యలు నుంచి బయట పడతారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. అన్ని రంగాల వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.
తుల
వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వ్యాపారాలకు ప్రారంభానికి శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
వృశ్చికం
కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. సోదరుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకునూతనప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్ధిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.
ధనస్సు
దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. దూరప్రయాణాలు కలసివస్తాయి. చుట్టుపక్కల వారితో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార పెట్టుబడులు ఈ విషయంలో పునరాలోచన మంచిది. ఉద్యోగులకు అదనపు పని భారం నుండి ఉపశమనం కలుగుతుంది.
మకరం
ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. కుటుంబ పెద్దల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగినా సమయానికి పూర్తిచేస్తారు. ధనాదాయం బాగుంటుంది. విద్యార్థులు నూతన విద్యలపై ఆసక్తి పెరుగుతుంది.
కుంభం
సంఘంలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. వ్యాపారాలు ప్రారంభానికి ఆప్తుల నుండి పెట్టుబడులు అందుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. గృహనిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. నూతన వాహన యోగం ఉన్నది.
మీనం
నిరుద్యోగులుకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ఉద్యోగమున పురోగతి కలుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….


Share

Related posts

Today Horoscope డిసెంబర్ 5th శనివారం రాశి ఫలాలు

Sree matha

Today Horoscope సెప్టెంబర్ 16th బుధవారం మీ రాశి ఫలాలు

Sree matha

శివుడ్ని ఈ రకంగా పూజిస్తే .. విధ్యార్ధులకి చాలా చాలా మంచిది !

Kumar