Today Horoscope: సెప్టెంబర్ 14 – బాధ్రపదమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope
Share

Today Horoscope: సెప్టెంబర్ 14 – మంగళవారం – బాధ్రపదమాసం

మేషం
ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సన్నిహితులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు అధికమవుతాయి.

Today Horoscope
Today Horoscope

వృషభం
నిరుద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటాబయటా ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.
మిధునం
నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. గృహమునకు ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఉద్యోగాలలో సమస్యలు తొలగి హోదాలు పెరుగుతాయి.
కర్కాటకం
కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం తప్పదు.
సింహం
దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. స్నేహితులు మీ మాటతో విబేదిస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
కన్య
చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆదాయం సంతృప్తికరం ఉంటుంది. ఇంటా బయట కొన్ని సమస్యలు సన్నిహితుల సాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు.
తుల
కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆదాయం మరింత నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో చికాకులు తప్పవు. కొందరి ప్రవర్తన వలన శిరో బాధలు తప్పవు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి ఉండదు.
వృశ్చికం
చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేయగలుగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
ధనస్సు
ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి . మిత్రులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు తప్పవు. ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగ యత్నాలు మందకొడిగా సాగుతాయి.
మకరం
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంతకాలం పడిన కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ధార్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.
కుంభం
సంతాన ఉద్యోగ,వివాహయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. సోదరులతో స్థిరాస్తి విషయాలలో నూతన ఒప్పందం చేసుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
మీనం
ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. సన్నిహితులతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో పునరాలోచన చేయడం మంచిది. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో వివాదాలు తప్పవు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….


Share

Related posts

పూజావేళల్లో పుష్పాలు ఎందుకు వినియోగిస్తారు..?

Sree matha

కృష్ణాష్టమి నాడు పఠించాల్సిన స్తోత్రం !

Sree matha

జూన్ 6 రాశి ఫలాలు శనివారం మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూడండి

Kumar