Today Horoscope: సెప్టెంబర్ 26 – బాద్రపదమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope
Share

Today Horoscope: సెప్టెంబర్ 26 – ఆదివారం – బాధ్రపదమాసం

మేషం
కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి.

Today Horoscope
Today Horoscope

వృషభం
స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ప్రముఖుల నుంచి ముఖ్యసమాచారం సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.
మిధునం
ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో సన్నిహితుల నుంచి అందిన సమాచారం నిరాశ కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో వ్యయప్రయాసలు తప్పవు. ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
కర్కాటకం
చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం అవుతాయి.
సింహం
దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.
కన్య
ఆప్తులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ప్రయాణాలలో శ్రమ మరింత అధికమవుతుంది. విలువైన వస్తువులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు అధికమవుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.
తుల
కుటుంబసభ్యులు ఒత్తిడులు పెంచుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు.
వృశ్చికం
చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. దైవ సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
ధనస్సు
సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది ఆప్తుల నుంచి అవసరానికి ధనం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.
మకరం
ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలో పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.
కుంభం
ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.
మీనం
నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సంఘంలో సరైన గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….


Share

Related posts

అయ్యయ్యో .. ఎంతపని చేశావ్ పూజా .. రాధే శ్యామ్ పై లీక్ చేసెసింది ??

GRK

Vakeel saab : వకీల్ సాబ్ ప్రమోషన్స్ కి దిల్ రాజు ఎంత ఖర్చు చేస్తున్నాడో తెలుసా..?

GRK

Aathmika gorgeous images

Gallery Desk