Today Horoscope: జనవరి 3 – పుష్యమాసం – రోజు వారీ రాశి ఫలాలు..

Today Horoscope jan 9th 2022
Share

Today Horoscope: జనవరి – 3 పుష్యమాసం – సోమవారం
మేషం
చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించాలి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశపరుస్తాయి.

Today Horoscope

 

Today Horoscope: వృషభం
రుణదాతల నుండి ఒత్తిడులు అధికమవుతాయి ధన పరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు.
మిధునం
ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయ ప్రముఖుల నుండి సభ,సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
కర్కాటకం
అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. సంతాన వివాహ విషయమై చర్చలు ఫలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందగలుగుతారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.
సింహం
సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. దూరప్రయాణాలు వాయిదా పడతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది. వ్యాపార,ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఉంటాయి.
కన్య
చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత నిరుత్సాహపరుస్తాయి, విద్యార్థులకు ఒత్తిడులు తప్పవు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగపరంగా అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
తుల
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. గృహమున కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. విందు వినోదాది కార్యక్రమాలకు హాజరు అవుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
వృశ్చికం
ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి ఒక వ్యవహారంలో ఒత్తిడి అధికమవుతుంది ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
ధనస్సు
ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి నుండి బయట పడతారు.
మకరం
సన్నిహితులతో మాటపట్టింపులు తప్పవు. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి, ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
కుంభం
సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.
మీనం
చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..


Share

Related posts

Temple: ఏ గుడికి వెళ్లి నప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? గుడిలో ఆత్మ ప్రదక్షిణ చేయవచ్చా?

siddhu

లైఫ్ లెసన్ : ఎలా ఉండే మీరు ఎలా అయిపోయారు .. ఒక్కసారి తెలుసుకోండి !

Kumar

తిరుమల శ్రీవారి ఆలయంలో బలిహరణం విశేషాలు ఇవే !!

Sree matha