NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: మే 18 – వైశాఖ మాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope: మే 18 – మంగళవారం – వైశాఖ మాసం

మేషం

ఆకస్మిక ప్రయాణాలు. రాబడికి మించిన ఖర్చులు. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఇంటా బయటా సమస్యలు వేధిస్తాయి. ఆలోచనలు అంతగా కలసిరావు. రియల్ ఎస్టేట్ల వారికి కొన్ని సమస్యలు. వ్యాపారాలలో వ్యయప్రయాసలు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నిరుత్సాహం. ఐటీ నిపుణులకు ఒత్తిడులు. విద్యార్థులు మరింతగా శ్రమించాలి. మహిళలకు మానసిక అశాంతి. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు….కాఫీ, తెలుపు.

రెమిడి..శివ పంచాక్షరి పఠించండి.

Today Horoscope
Today Horoscope

 

వృషభం

పలుకుబడి పెరుగుతుంది. సోదరులతో వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. అందరిలోనూ గౌరవమర్యాదలు మరింతగా లభిస్తాయి. నూతన వస్తు లాభాలు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది, రుణబాధలు తొలగుతాయి. రియల్ ఎస్టేట్ల వారికి శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలలో మరింత అభివృద్ధి. ఉద్యోగులకు ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు వివాదాలు. ఐటీ నిపుణులు తమ ప్రతిభ చాటుకుంటారు. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి. షేర్ల విక్రయాలలో లాభాలు.

అదృష్ట రంగులు….గులాబీ, ఆకుపచ్చ.

రెమిడి …కనకధారా స్తోత్రాలు పఠించండి.

మిథునం

బంధువర్గంతో అకారణంగా తగాదాలు. దూర ప్రయాణాలు సంభవం. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. శారీరక రుగ్మతలు. ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. రియల్ ఎస్టేట్ల వారికి సామాన్యంగా ఉంటుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు విధుల్లో మార్పులు. పారిశ్రామికవర్గాలకు సమస్యలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఐటీ నిపుణులకు ఒత్తిడులు పెరుగుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు చేజారతాయి. మహిళలకు మానసిక ఆందోళన. షేర్ల విక్రయాలు మందకొడిగా సాగుతాయి.

అదృష్ట రంగులు….ఎరుపు, తెలుపు.

రెమిడి .. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

కర్కాటకం

నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. సన్నిహితుల సాయంతో పనులు పూర్తి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి సూచనలు స్వీకరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రియల్టర్లు వివాదాలు, సమస్యల నుంచి బయట పడతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూల పరిస్థితులు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అరుదైన హోదాలు. ఐటీ నిపుణులకు చిక్కులు తొలగుతాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు నూతనోత్సాహం. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు….ఎరుపు, పసుపు.

రెమిడీ ..శ్రీ రామ స్తోత్రదిన రాశి ఫలం

సింహం

కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. ఆదాయం కంటే ఖర్చులు అధికమవుతాయి. ఒక సమాచారం కొంత నిరుత్సాహ పరుస్తుంది. శ్రమకు ఫలితం అంతగా కనిపించదు. దూర ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ల వారికి చికాకులు. వ్యాపారాలలో ఆటుపోట్లు చికాకు పరుస్తాయి. ఉద్యోగులకు స్థానచలనం. రాజకీయవర్గాలు, కళాకారులకు అంచనాలలో పొరపాట్లు. ఐటీ నిపుణులకు శ్రమకు ఫలితం ఉండదు. విద్యార్థులకు నిరుత్సాహ పూరితంగా ఉంటుంది. మహిళలకు కుటుంబ సమస్యలు వేధిస్తాయి. షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు….గోధుమ, నీలం.

రెమిడి … హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

కన్య

సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో వ్యక్తిగత విషయాలు చర్చిస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. పాత సంఘటనలు నెమరువేసుకుంటారు. ఆస్థి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ల వారికి కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు రావచ్చు. ఐటీ నిపుణులకు ఆశలు ఫలించే సమయం. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది. షేర్ల విక్రయాలలో లాభాలు.

అదృష్ట రంగులు….ఎరుపు, గులాబీ.

రెమిడి.. విష్ణు ధ్యానం చేయండి.

తుల

దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆలోచనలు అమలు చేస్తారు. బంధువుల నుంచి కొంత ధనసాయం అందుతుంది. నూతన వ్యక్తుల పరిచయం. ఆలయాలు సందర్శిస్తారు. సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. రియల్టర్లు, కాంట్రాక్టర్ల యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార లావాదేవీలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగాల్లో చికాకులు అధిగమించి ముందుకు సాగుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకున్నది సాధించే సత్తా కలుగుతుంది. ఐటీ నిపుణులకు శుభవార్తలు. విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు శుభవర్తమానాలు. విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….గులాబీ, కాఫీ.

రెమిడీ .. శివాష్టకం పఠించండి.

వృశ్చికం

ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. శ్రమానంతరం కొన్ని పనులు పూర్తి చేస్తారు. రాబడి నిరుత్సాహపరుస్తుంది. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు. స్నేహితులతో అకారణంగా విభేదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్ల వారికి సామాన్యస్థితి. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో చికాకులు మరింత పెరుగుతాయి. కళాకారులు, పారిశ్రామికవర్గాల వారికి సమస్యలు తప్పవు. ఐటీ నిపుణులు కొంత సంయమనం పాటించాలి. విద్యార్థుల యత్నాలు నత్తనడకన సాగుతాయి. మహిళలకు కుటుంబసభ్యుల నుంచి విమర్శలు . షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు….గులాబీ, కాఫీ,

రెమిడి .. గణేశ్ స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు

దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులతో విరోధాలు. కుటుంబంలో ఒత్తిడులు. ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశపరుస్తాయి. రియల్ ఎస్టేట్ల వారికి భాగస్వాములతో సమస్యలు. వ్యాపారాలలో ఆటుపోట్లు, లాభాలు కష్టమే. ఉద్యోగులకు స్థాన మార్పులు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు చికాకులు. ఐటీ నిపుణుల యత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులకు గందరగోళ పరిస్థితి. మహిళలకు కుటుంబసభ్యులతో విభేదాలు. షేర్ల విక్రయాలు మందకొడిగా సాగుతాయి.

అదృష్ట రంగులు…. ఎరుపు, గులాబీ.

రెమిడి .. ఆంజనేయ దండకం పఠించండి.

మకరం

ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. ఇంటాబయటా అనుకూలం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు, గృహం కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ల వారికి నూతనోత్సాహం. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు లభిస్తాయి. పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు సత్కారాలు. ఐటీ నిపుణులకు ఆహ్వానాలు.  విద్యార్థులకు కొత్త అవకాశాలు. మహిళలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….పసుపు, గులాబీ.

రెమిడి.. అన్నపూర్ణాష్టకం పఠించండి.

కుంభం

ఉన్నత వ్యక్తులతో పరిచయాలు. ఆదాయం మరింత సంతృప్తికరంగా ఉంటుంది. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. రియల్ ఎస్టేట్ల వారికి ఊహించని లాభాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు శుభవర్తమానాలు. మహిళలకు భూలాభం. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు…. గులాబీ , లేత పసుపు.

రెమిడి… విష్ణు ధ్యానం మంచిది.

మీనం

ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. ఆర్థిక ఇబ్బందులు దురవుతాయి. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్లు, కాంట్రాక్టర్లు అనుకున్నది సాధించడంలో వెనుకంజ వేస్తారు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు వ్యవహారాల్లో అవరోధాలు. ఐటీ నిపుణులకు సహనం అవసరం. విద్యార్థులకు ప్రయత్నాలు అనుకూలించవు. మహిళలకు నిరాశాజనకంగా ఉంటుంది. షేర్ల విక్రయాలు సామాన్యం.

అదృష్ట రంగులు….కాఫీ, తెలుపు.

రెమిడి .. కనకదుర్గా స్తోత్రాలు పఠించండి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 5 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju