NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: మే 19 – వైశాఖమాసం – రోజువారీ రాశి ఫలాలు

Today Horoscope: మే 19 – బుధవారం – వైశాఖమాసం

మేషం

అనుకోని ప్రయాణాలు. ఆదాయం అంతగా కనిపించదు. సోదరులు, మిత్రులతో విరోధాలు. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. రియల్టర్లకు అంచనాలు తప్పుతాయి. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. పారిశ్రామిక వేత్తలు,కళాకారులకు ఒడిదుడుకులు. ఐటీ నిపుణులు ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకు కొంత ఇబ్బంది కరంగా ఉంటుంది. మహిళలకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. షేర్ల విక్రయాలు సామాన్యం.

అదృష్ట రంగులు….నలుపు, గులాబీ.

రెమిడి.. ఆదిత్య హృదయం పఠించండి.

Today Horoscope
Today Horoscope

వృషభం

కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. చిన్ననాటి మిత్రులతోఉత్సాహంగా గడుపుతారు. మీ మాటలతో అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగ్గా ఉంటుంది. రియల్ ఎస్టేట్లు, కాంట్రాక్టర్లకు శుభ వార్తలు అందుతాయి. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అనుకోని అవకాశాలు. ఐటీ నిపుణులకు సంతోషకర విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. మహిళలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….పసుపు, గులాబీ,

రెమిడి .. గణపతిని పూజించండి.

మిథునం

ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మిత్రులు, బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. రియల్టర్లు శ్రమాధిక్యం తప్పదు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు మార్పులు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఐటీ నిపుణులకు బాధ్యతల నిర్వహణలో ఆటంకాలు. విద్యార్థులకు అవకాశాలు దూరమవుతాయి. మహిళలకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.

అదృష్ట రంగులు….గోధుమ, తెలుపు.

రెమిడి .. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం

పెండింగ్ వ్యవహారాలు కూడా చక్కబెడతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. సన్నిహితులు మీకు వెన్నంటి ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ల వారికి భూలాభాలు. వ్యాపార లావాదేవీలు ఊపందు కుంటాయి. ఉద్యోగాల్లో కొత్త హోదాలు దక్కించుకుంటారు. రాజకీయ వర్గాలకు పదవులు రావచ్చు. ఐటీ నిపుణులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకున్న అవకాశాలు దక్కుతాయి. మహిళలకు శుభవర్తమానాలు. షేర్ల విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

అదృష్ట రంగులు…. గులాబీ, లేత పసుపు,

రెమిడి.. కనకధారా స్తోత్రాలు పఠించండి.

సింహం

ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలతో గడుపుతారు. కుటుంబంలో చికాకులు, కష్టపడ్డా ఫలితం ఉండదు. ఆరోగ్య పరంగా చికాకులు. బంధువుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. రియల్టర్లకు కొన్ని కేసులు ఎదురవుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులు అదనపు పనిభారంతో సతమతమవుతారు. రాజకీయవేత్తలు, కళాకారులకు మరిన్ని ఇబ్బందులు. ఐటీ నిపుణులకు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు చేజారతాయి. మహిళలకు మానసిక ఆందోళన. షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు… గోధుమ, పసుపు.

రెమిడి.. నరసింహ స్తోత్రాలు పఠించండి.

కన్య

ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. నూతన వస్తులాభాలు. పనులు చకచకా చక్కబెడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. దైవ కార్యాలలో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ల వారికి ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహం. ఐటీ నిపుణులు నైపుణ్యాన్ని చాటుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలకు ఆస్తిలాభం. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….ఆకుపచ్చ, గోధుమ.

రెమిడి .. గణపతి స్తోత్రాలు పఠించండి.

తుల

కొత్త కార్యక్రమాలు చేపడతారు. వాహనాలు, ఆభరణాలు స్థలాలు కొంటారు. నిరుద్యోగులు నైపుణ్యతను నిరూపించుకుంటారు. ఇంత కాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. రియల్ ఎస్టేట్ల వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి కలుగుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విజయాలు దక్కుతాయి. ఐటీ నిపుణులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.  విద్యార్థులకు అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు తీరతాయి. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు….పసుపు, కాఫీ,

రెమిడి .. హనుమాన్చాలీసా పఠించండి.

వృశ్చికం

ఊహించని దూర ప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. బంధువులు, మిత్రులతో అకారణంగా విరోధాలు. శారీరక రుగ్మతలు. దైవ కార్యాలు నిర్వహిస్తారు. కాంట్రాక్టులలో చికాకులు. వ్యాపారులకు నిదానం అవసరం. లాభాలు కష్టమే. ఉద్యోగులకు స్థాన చలనం. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు కొన్ని ఇబ్బందులు దురవుతాయి. ఐటీ నిపుణులు మరింత పట్టుదలతో ముందుకు సాగాలి. విద్యార్థులకు అనుకున్న అవకాశాలు చేజారవచ్చు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు. షేర్ల విక్రయాలలో ఆచితూచి వ్యవహరించండి.

అదృష్ట రంగులు….గులాబీ, లేత ఎరుపు.

రెమిడి … హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు

కొన్ని పనులు మధ్యలో వాయిదా వేస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఇంటాబయటా ఒత్తిడులు, విమర్శలు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. రియల్టర్లకు గందరగోళ పరిస్థితి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పని భారం తప్పదు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు లేనిపోని ఇబ్బందులు. ఐటీ నిపుణులకు ఆటుపోట్లు. విద్యార్థులకు అంచనాలలో పొరపాట్లు. మహిళలకు మానసిక ఆందోళన. షేర్ల విక్రయాలు మందకొడిగా సాగుతాయి.

అదృష్ట రంగులు….నీలం, తెలుపు.

రెమిడి .. లక్ష్మీ స్తుతి మంచిది.

మకరం

పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆత్మీయులు మరింతగా సహకరిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. రియల్టర్లు కొత్త వెంచర్లపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయ వేత్తలకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. ఐటీ నిపుణులకు మంచి గుర్తింపు రాగలదు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు మానసిక ప్రశాంతత. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….పసుపు, కాఫీ,

రెమిడి .. దేవీస్తుతి మంచిది.

కుంభం

ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగలాభం. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రియల్టర్లకు మరింత ప్రోత్సాహం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు చెప్పుకోతగిన అభివృద్ధి కనిపిస్తుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు కొత్త అవకాశాలు మరిన్ని దక్కుతాయి. ఐటీ నిపుణులకు కొత్త ఆలోచనలు కలసివస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలకు శుభవార్తలు. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు….గోధుమ, కాఫీ,

రెమిడి .. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మీనం

రావలసిన సొమ్ము సకాలంలో అందదు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు పెరుగుతాయి. శారీరక రుగ్మతలు. కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కాంట్రాక్టులు చివరిలో చేజారతాయి. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. పారిశ్రామిక రంగం వారికి కొంత నైరాశ్యం. ఐటీ నిపుణులకు ఎటు చూసినా ప్రతికూలతే. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. మహిళలకు మానసిక ఆందోళన. షేర్ల విక్రయాలు సామాన్యం.

అదృష్ట రంగులు….తెలుపు, కాఫీ.

రెమిడి .. విష్ణుధ్యానం చేయండి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju