Today Horoscope: మే 30 – వైశాఖ మాసం –రోజువారీ రాశిఫలాలు

Share

Today Horoscope: మే 30 –  ఆదివారం – వైశాఖ మాసం

మేషం

కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆలోచనలు అమలులో పెడతారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారులకు అధిక లాభాలు దక్కే అవకాశం. ఉద్యోగాలలో ఉన్నతహోదాలు రాగలవు. కళాకారులకు కొన్ని అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. మహిళలకు సంతోషకరమైన సమాచారం.

అదృష్ట రంగులు….గోధుమ, కాఫీ.

రెమిడీ …సుబ్రహ్మణ్యాష్టకం పఠించాలి.దిన రాశి ఫలం

Today Horoscope:
Today Horoscope:

వృషభం

ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పనుల్లో ఆటంకాలు ఎదురుకావచ్చు. ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. కళాకారులకు అవకాశాలు దూరమవుతాయి. విద్యార్థులు శ్రద్ధ వహించాలి. మహిళలకు నిరుత్సాహమే.

అదృష్ట రంగులు….పసుపు, ఆకుపచ్చ.

రెమిడి … వేంకటేశ్వరస్వామిని పూజించండి.

మిథునం

రాబడికి కన్నా ఖర్చులు పెరుగుతాయి. ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. ఆరోగ్యసమస్యలు చికాకు పరుస్తాయి. కాంట్రాక్టులు చివరిలో చేజారతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగాలలో పనిభారం. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు. కళాకారులకు అవకాశాలు నిరాశ పరుస్తాయి. విద్యార్థులు డీలా పడతారు. మహిళలు నిర్ణయాలలో తొందరపడరాదు.

అదృష్ట రంగులు….గులాబీ, నీలం.

రెమిడి .. హనుమాన్ చాలీసా పఠించండి.

కర్కాటకం

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఉద్యోగ యత్నాలలో అనుకూల పరిస్థితి. ఆప్తుల నుంచి శుభవార్తమానాలు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి.  ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులకు ఊహించని అవకాశాలు. విద్యార్థులకు అన్నింటా విజయాలే. మహిళలకు కుటుంబంలో అనుకూల వాతావరణం.

అదృష్ట రంగులు….గోధుమ,కాఫీ.

రెమిడి .. గణపతిని పూజించండి.

సింహం

పనుల్లో పురోగతి ఉంటుంది. ఇంటాబయటా చికాకులు తొలగి ఊరట చెందుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. నూతన కాంట్రాక్టులు పొందుతారు. కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కి వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామిక, వైద్యవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులు కొత్త అవకాశాలు అందుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలకు నూతనోత్సాహం.

అదృష్ట రంగులు….గోధుమ, కాఫీ.

రెమిడి .. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి.

కన్య

పనుల్లో జాప్యం తప్పదు. ఆదాయం తగ్గి అప్పులు సైతం చేస్తారు.వ్యవహారాలలో అంచనాలు తప్పుతాయి. సన్నిహితులతో విభేదాలు నెలకొంటాయి. మిత్రులు కూడా శత్రువులుగా మారతారు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాల వారు నిర్ణయాలలో నిదానం పాటించాలి. కళాకారులకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. విద్యార్థుల శ్రమ అంతగా ఫలించదు. మహిళలకు అనారోగ్యం.

అదృష్ట రంగులు….గులాబీ, లేత ఎరుపు.

రెమిడి… దత్తాత్రేయుని పూజించండి.

తుల

పనుల్లో ఆటంకాలు. ఉద్యోగ యత్నాలు ముందుకు సాగవు. శ్రమాధిక్యం తప్పదు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. గొంతు సంబంధిత రుగ్మతలు. కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలలో అవాంతరాలు. కళాకారులు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. విద్యార్థులకు ఒడిదుడుకులు ఎదురవుతాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు.

అదృష్ట రంగులు….ఆకుపచ్చ, తెలుపు.

రెమిడి … హనుమాన్ చాలీసా పఠించండి.

వృశ్చికం

ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. అనుకున్న విధంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశాలు. కళాకారులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది.. విద్యార్థులు సాంకేతికపరమైన విద్యావకాశాలు. మహిళలకు ఆస్తి వివాదాల పరిష్కారం.

అదృష్ట రంగులు….బంగారు, ఎరుపు.

రెమిడి ..  శివాష్టకం పఠించండి.

ధనుస్సు

వ్యయప్రయాసలు తప్పవు. దూర ప్రయాణాలు ఉండవచ్చు. ఇంటాబయటా చికాకులు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు. పారిశ్రామిక వర్గాలకు వ్యవహారాలు ముందుకు సాగవు. కళాకారులకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. విద్యార్థులకు అనుకున్న అవకాశాలు దూరమవుతాయి. మహిళలకు నిరుత్సాహమే.

అదృష్ట రంగులు….నలుపు, ఆకుపచ్చ.

రెమిడి .. శ్రీ రామ స్తోత్రాలు పఠించాలి.

మకరం

కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం.వాహనయోగం కలుగుతుంది. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి లాభాలు అందుకుంటారు. పారిశ్రామికరంగం వారికి విదేశీ సంస్థల నుంచి ఆహ్వానాలు. కళాకారులకు నూతనోత్సాహం. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు శుభవర్తమానాలు.

అదృష్ట రంగులు….పసుపు, కాఫీ.

రెమిడి.. గణపతిని పూజించండి.

కుంభం

కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. శ్రమ తప్పదు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరికాగలరు. మిత్రులతో కలహాలు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుతుంది. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు. కళాకారులకు కొన్ని అవకాశాలు చేజారవచ్చు. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదురవుతాయి.

అదృష్ట రంగులు…. ఆకుపచ్చ, బంగారు.

రెమిడి.. శివ స్తోత్రాలు పఠించాలి.

మీనం

వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు ఉంటాయి. రావలసిన సొమ్ము అనుకున్న విధంగా అందుతుంది. కొన్ని వివాదాలు, సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు అనుకూలం. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు నూతనోత్సాహం. రాజకీయవర్గాలకు పదవీయోగం. కళాకారులకు సంతోషదాయకమైన కాలం.విద్యార్థులు నైపుణ్యం చాటుకుంటారు. మహిళలకు ఆస్తి లాభాలు.

అదృష్ట రంగులు….గులాబీ, లేత పసుపు.

రెమిడి.. ఆదిత్య హృదయం పఠించండి.


Share

Related posts

Today Horoscope: మే 10 – చైత్రమాసం – రోజవారీ జాతక ఫలాల

somaraju sharma

Today Horoscope నవంబర్ 19th గురువారం రాశి ఫలాలు

Sree matha

Daily Horoscope జూలై 21 మంగళవారం మీ రాశి ఫలాలు

Sree matha