Today Horoscope: జూన్ 2 –  వైశాఖ మాసం – రోజువారి రాశి ఫలాలు

Share

Today Horoscope: జూన్ 2 – బుధవారం

మేషం

వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆప్తుల నుండి ధన సహాయ సహకారాలు అందుతాయి. దీర్ఘ కాలిక రుణాలు నుండి విముక్తి లభిస్తుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు లభిస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

Today Horoscope
Today Horoscope

వృషభం

దాయాదులతోఆస్థివివాదాలు పరిష్కరించుకుంటారు  వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఆశించిన సహకారం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆత్మ విశ్వాసంతో పని చేసి లాభాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు  అమలు చేస్తారు నిరుద్యోగులకు  వచ్చిన అవకాశలు సద్వినియోగం చేసుకోవాలి.

మిధునం

సంతాన విషయమై  ఊహించని విషయాలు తెలుస్తాయి. ఋణ ఒత్తిడి అధికమై మానసిక శిరో భాధలు తప్పవు.  దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. దైవ సేవ కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. స్థిరాస్తి ఒప్పందాలు కష్టం మీద పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

కర్కాటకం

ఇంట బయట ఒత్తిడి వలన శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులుకు మీ అభిప్రాయాన్ని నచ్చవు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు. కుటుంబ పెద్దలతో మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. వ్యాపారాలు  మందగిస్తాయి .

సింహం

సమాజంలో  కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.ఆర్ధిక  పరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం  కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అందరితో  సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. వాహన అనుకూలత కలుగుతుంది. జీవిత భాగస్వామితో ప్రయాణ సూచనలున్నవి.

కన్య

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రుల నుండి ఆశించిన ధనసహాయం అందుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రవర్తనకు అధికారుల నుండి  ప్రశంసలు అందుకుంటారు.

తుల

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. శారీరక మానసిక సమస్యలు భాదిస్తాయి. గృహమున విలువైన పత్రములు  విషయంలో  జాగ్రత్త వ్యవహరించాలి వ్యాపారాలలో స్వంత  నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగమున విధులు సరిగా నిర్వర్తించలేక పై వారి నుండి మాట పడవలసి వస్తుంది. కుటుంబ విషయంలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు.

వృశ్చికం

బంధు మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా  ఉంటాయి.

ధనస్సు

నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కీలకమైన  పనులలో  ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభపడతారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

మకరం

ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. సమయానికి నిద్రహారాలు ఉండవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ  వాతావరణం ఉంటుంది. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి.

కుంభం

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మీనం

ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయటా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

నిత్రా యాప్ సౌజన్యంతో…


Share

Related posts

నరసింహ అవతార క్షేత్రం అహోబిలం !!

Sree matha

Today Horoscope సెప్టెంబర్ 20th ఆదివారం మీ రాశి ఫలాలు

Sree matha

Today Horoscope సెప్టెంబర్ 15th మంగళవారం మీ రాశి ఫలాలు

Sree matha