Today Horoscope: జూన్ 4 – వైశాఖ మాసం- రోజు వారీ రాశి ఫలాలు

Share

Today Horoscope:  జూన్ 4 – శుక్రవారం –  వైశాఖ మాసం

మేషం

ఆదాయం సరిపడినంత ఉండదు. వృధా ఖర్చులు పెరుగుతాయి.   దూర ప్రయాణాలు ఇబ్బందికరంగా సాగుతాయి. అన్ని రంగాల వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. బంధు మిత్రులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కుటుంబ సభ్యుల  ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

Today Horoscope:
Today Horoscope:

వృషభం

వృత్తి ఉద్యోగాలలో నూతన పదవులు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యములకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఋణాలు తీర్చగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారములలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

మిధునం

బంధు మిత్రుల నుండి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.  చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది జీవిత భాగస్వామితో  శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు అందివచ్చిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో  మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు. వ్యాపారాలు నూతన ప్రణాళికలు అమలు చేస్తారు.

కర్కాటకం

దూరపు బంధువుల నుండి ఊహించని వార్తలు వినవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయ్యడం మంచిది. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

సింహం

ఋణ సమస్యలు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. కుటుంబ ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు.

కన్య

ప్రముఖుల పరిచయాల వలన అనుకున్న పనులు వేగంగా  పూర్తిచేస్తారు. ఆప్తుల నుండి అందిన అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. పాత బాకీలు తీర్చగలుగుతారు. వ్యాపార విస్తరణలో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.

తుల

దీర్ఘ కాలిక సమస్యలు పరిష్కారానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరులు నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం

బంధు మిత్రుల తో మనస్పర్ధలు పెరుగుతాయి. ఇంట బయట ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. ప్రయాణాలు అంతగా కలసిరావు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టినపనులలో అవరోధాలుతప్పవు. ఆలోచనలలో స్థిరత్వంఉండదు. వృత్తి, వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగస్తులు   అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు.

ధనస్సు

ఆర్థిక వ్యవహారాలలో ఆశించినరీతిగా ఉండవు. ముఖ్యమైన వ్యవహారాలలో సమయానుకూలంగా నిర్ణయాలు అమలు చెయ్యలేరు. కుటుంబ వాతావరణం చికాకులు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు  మరింత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారులతో అలోచించి  మాట్లాడటం మంచిది.

మకరం

ఇంట బయట మీ ప్రవర్తనతో అందరిని ఆకట్టుకుంటారు. బంధు మిత్రులని కలుసుకుని గృహమున ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలని నిర్వహిస్తారు. సంఘంలో ప్రముఖుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోభివృద్ధి కలుగుతుంది.

కుంభం

ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. సోదరుల నుండి ధనపరంగా ఊహించని చిక్కులు కలుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వ్యర్ధంగా మిగులుతాయి. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక  చింతన పెరుగుతుంది.

మీనం

చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి. దీర్ఘ కాలిక ఋణాలు తీర్చగలుగుతారు. నూతనవస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్ధిరాస్తి సంభందిత వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి.


Share

Related posts

Annaprasana: బిడ్డ పుట్టిన తర్వాత చేసే అన్నప్రాశనంలో పొరపాట్లు జరగకుండా… కొన్ని విషయాలు తెలుసుకోండి!!

Kumar

Today Horoscope జనవరి -13- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.

Sree matha

Horoscope : Today Horoscope ఫిబ్రవరి-3- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.

Sree matha