Today Horoscope: జూన్ 7 – వైశాఖ మాసం – రోజువారీ రాశి ఫలాలు

Share

Today Horoscope: జూన్ 7 – సోమవారం – వైశాఖ మాసం

మేషం

ఇంటాబయటా నూతన ప్రణాళికలను అమలు పరుస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగ వాతావరణం  ఉత్సాహంగా ఉంటుంది.

Today Horoscope:
Today Horoscope:

వృషభం

బంధుమిత్రులతో వివాదాలు రావచ్చు. ఆకస్మిక ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. చేపట్టిన పనులను మరింత మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు కలసి వస్తాయి. ఉద్యోగంలో అధికారులతో సమస్యలు కలుగుతాయి.

మిధునం

చేపట్టిన పనులలో మీ శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఇంటా బయటా నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఉద్యోగస్తులకు వివాదాలు తీరి ఊరట చెందుతారు.

కర్కాటకం

నూతన ఉద్యోగ యత్నాలు కలసి వస్తాయి. రాజకీయ సంబంధిత సమావేశాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు.  ఉద్యోగమున మీ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.

సింహం

బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సోదరుల నుండి ధన పరమైన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కన్య

ముఖ్యమైన వ్యవహారాలలో పరిస్థితులు అనుకూలించవు.  వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు.  బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఆలోచనలో స్థిరత్వం ఉండదు. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు.

తుల

స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో చికాకులు అధిగమించి ముందుకు సాగుతారు.

వృశ్చికం

ముఖ్యమైన వ్యవహారాలలో స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.  ఆకస్మిక ధనలాభం సూచనలుఉన్నవి. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి.

ధనస్సు

కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి.

మకరం

చేపట్టిన పనులలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. నిరాశ కలుగుతుంది.  ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు.  ప్రయాణాలలో వాహన  ఇబ్బందులు ఉంటాయి.

కుంభం

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. కీలక వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరించి మీ మాటకు విలువ పెంచుకుంటారు. వ్యాపారాలలో నూతన నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు  సానుకూలమవుతాయి.

మీనం

చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.అధిక శ్రమతో స్వల్ప ఫలితం పొందుతారు. ఆరోగ్యపరంగా అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…


Share

Related posts

Zodiac signs : నలుగురి లో  ఈ రాశి వారు పొందేంత  గుర్తింపు ఇంక ఎవ్వరు  పొందలేరు!! (పార్ట్ -2)

Kumar

Daily Horoscope ఆగష్టు 22nd శనివారం మీ రాశి ఫలాలు

Sree matha

Daily Horoscope జూన్‌ 26 శుక్రవారం మీ రాశి ఫలాలు

Sree matha