Today Horoscope: జూన్ 8 – మంగళవారం – వైశాఖమాసం
మేషం
చేపట్టిన పనులు చకచకా పూర్తవుతాయి. ఆప్తులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.
వృషభం
బంధు మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. పనులలో శ్రమ అధికం అవుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి.
మిధునం
ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.
కర్కాటకం
సమాజంలో నూతన వ్యక్తులతో పరిచయాలు భవిష్యత్తు ఉపయోగపడతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెంచుకుంటారు. ఆస్థి వివాదాలు నుండి బయటపడతారు. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.
సింహం
దూరప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. ఆలోచనల్లో స్థిరత్వం లేకపోవడం వలన పనులు మందగిస్తాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో అంచనాలను అందుకోవడంలో విఫలమవుతారు. ఉద్యోగాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
కన్య
దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవాంతరాలుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. మిత్రులతో వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు.
తుల
నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో విశేషమైన ఆదరణ పొందుతారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.
వృశ్చికం
ఇంటా బయట బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి విశేషమైన ఆదరణ పొందుతారు. దీర్ఘకాలిక వివాదాల పరిష్కారం లభిస్తుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో బాగస్తులతో సఖ్యత కలుగుతుంది. ఉద్యోగంలో అధికారులతో విభేదాలు తలెత్తుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
ధనస్సు
ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. దూర ప్రయాణాలు మధ్యలో నిలిపివేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం లేక నిరాశ కలుగుతుంది. దాయాదులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి.
మకరం
చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రులు నుండి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన సమస్యలు కలిగి చికాకులు పెరుగుతాయి.
కుంభం
చేపట్టిన పనులు సకాలంలోపూర్తవుతాయి. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్ధిరాస్తి ఒప్పందాలు కలసివస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు అందిన ఒక వార్త ఊరట కలిగిస్తుంది.
మీనం
ఆప్తులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితులు కొంత గందరగోళంగా ఉంటుంది. దూర ప్రయాణాలలో వాహన పరమైన ఇబ్బందులు కలుగుతాయి. ఋణ దాతల ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులలో మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
నిత్ర రాశి ఫలాల యాప్ సౌజన్యంతో..