Today Horoscope: జూన్ 19 – జ్యేష్టమాసం – రోజువారీ రాశి ఫలాలు

Today Horoscope:
Share

Today Horoscope: జూన్ 19 – శనివారం – జ్యేష్టమాసం

మేషం

అనుకొన్న పనుల్లో విజయం సాధిస్తారు.  కుటుంబ సభ్యులతో కొన్ని కీలక  విషయాలపై చర్చలు చేస్తారు. ఊహించని శుభకార్యా ఆహ్వానాలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది.నూతన వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు.

Today Horoscope:
Today Horoscope:

వృషభం

సమాజంలో కొత్త  మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన  పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సంతాన పరమైన ఇబ్బందులు బాధిస్తాయి.

మిధునం

స్ధిరాస్తి వివాదాలకు సంభందించి సన్నిహితుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. కుటుంబంలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో కొంత జాప్యం తప్పదు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలు కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.

కర్కాటకం

చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. అనుకొన్న పనులు నూతనోత్సాహంతో పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గృహనికి దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

సింహం

పాత మిత్రులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన  పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలు స్థిరత్వం ఉండవు.

కన్య

దీర్ఘకాలిక ఋణ సమస్యలు పరిష్కారం అవుతాయి. కొన్ని వ్యవహారాలు ఆకస్మికంగా విజయం  సాధిస్తారు. గృహములో  బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.

తుల

చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలు ఉన్నాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. దూరప్రయాణాలలో వాహన అవరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రారంభ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలు అధికారులనుండి ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం

ముఖ్యమైన వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. కుటుంబమున దీర్ఘ కాలిక సమస్యలు తీరతాయి. ఆర్థికంగా స్థిరమైన ఆలోచనలు చేస్తారు. నూతన  వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటాయి  నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

ధనస్సు

నిరుద్యోగుల శ్రమ ఫలించి నూతన అవకాశాలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో  కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

మకరం

వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తికావు.  బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్య వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.

కుంభం

సన్నిహితులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరమైన చికాకులు పెరుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. సోదర వర్గం నుండి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగక నిరాశకలిగిస్తాయి. వ్యాపారాలు స్వల్ప నష్ట సూచనలున్నవి.

మీనం

మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు.  ఉద్యోగాలు ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….


Share

Related posts

Today Horoscope: జూలై 29 – అషాఢమాసం – రోజు వారీ రాశి ఫలాలు

somaraju sharma

తొలి ఏకాదశి నాడు ఏం చేయాలి ?

Sree matha

ఐదో రోజు స్కందమాతగా దుర్గమ్మ..!

Sree matha