Today Horoscope: జూన్ 22 – జ్యేష్ఠ మాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope:
Share

Today Horoscope: జూన్ 22 – మంగళవారం – జ్యేష్ఠ మాసం

మేషం

సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసే లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

Today Horoscope:
Today Horoscope:

వృషభం

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. గృహమును శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు రావలసిన పదవులు అప్రయత్నంగా దక్కుతాయి.

మిధునం

ఆర్థికంగా కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కొందరు ప్రవర్తన వలన శిరో బాధలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి.

కర్కాటకం

ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

సింహం

సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు కొంత వరకు తీర్చగలరు.

కన్య

జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులు జాప్యం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసిన నష్టపడతారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది.

తుల

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. దూరపు బంధువులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శించి ఉంటారు. స్ధిరాస్తి  లాభసూచనలు ఉన్నవి. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు.

వృశ్చికం

వృధా ప్రయాణాలు చేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. మిత్రులతో అకారణ కలహ సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో ఆశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి.

ధనస్సు

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. స్ధిరాస్తి  కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి కలుగుతుంది  ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

మకరం

కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పాత మిత్రులతో కొన్ని విషయాలు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగస్థులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

కుంభం

నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులలో శ్రమను మరింత పెరుగుతుంది. బంధు మిత్రులతో వివాదాలు కలుగుతాయి. తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారమున పెట్టుబడుల విషయంలో నిరాశ తప్పదు. ఉద్యోగ వాతావరణం మరింత గందరగోళంగా ఉంటుంది.

మీనం

ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో భాగస్తులుతో మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత కలుగుతుంది. ధన ఆదాయమార్గాలు మందగిస్తాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…


Share

Related posts

Today Horoscope ఏప్రిల్ – 5 – ఫాల్గుణ మాసం – సోమవారం. పెట్టుబడులు అనుకూలిస్తాయి !

Sree matha

తొండనాయనారు భక్తి విశేషాలు ఇవే !

Sree matha

Daily Horoscope జూలై 18 శనివారం మీ రాశి ఫలాలు

Sree matha