NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: జూన్ 29 – జ్యేష్ఠ మాసం – రోజువారీ రాశి ఫలాలు

Today Horoscope:

Today Horoscope: జూన్ 29 –మంగళవారం – జ్యేష్ఠ మాసం

మేషం

అప్రయత్నంగా పనులు పూర్తి అవుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థికంగా  ఆశించిన పురోగతి సాధిస్తారు. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు.

Today Horoscope:
Today Horoscope

వృషభం

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట మంచి మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు. రాజకీయ వర్గాల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. దైవ సేవ కార్యక్రమాలలో  పాల్గొంటారు.

మిధునం

ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు.ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో  నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

కర్కాటకం

చేపట్టిన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు. కుటుంబ  సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సంతాన  విద్య విషయాలు నిరుత్సహపరుస్తాయి.

సింహం

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్ధికంగా మరింత పురోగతి సాధిస్తారు. అనుకున్న సమయానికి  పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వృత్తి  వ్యాపారాలు అనుకూలంగా  సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

కన్య

నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్ధిక విషయాలలో  కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు.

తుల

చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు మీ  మాటతో విభేదిస్తారు. వృత్తి ఉద్యోగాలలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. వ్యాపార పరంగా ఊహించని సమస్యలు అధికమవుతాయి. దైవచింతన పెరుగుతుంది.

వృశ్చికం

ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి శిరో భాధలు పెరుగుతాయి. బంధువులతో విరోధాలు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.

ధనస్సు

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతానం నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. బంధుమిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మకరం

వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. బంధువర్గంతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో  శ్రమాధిక్యత  పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

కుంభం

దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి.అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

మీనం

ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. చిన్ననాటి  మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్యుల సంప్రదింపులు అవసరమవుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 11 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 10 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 9 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 8 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 7 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 6 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju