Today Horoscope: మే 6 – చైత్రమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Share

Today Horoscope: మే 6 – మేషం – గురువారం – చైత్రమాసం

వ్యవహారాల్లో అవాంతరాలు ఎదురవుతాయి. అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు. బంధు మిత్రుల నుండి అపవాదులు, రాబడి సమాన్యంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ల వారికి గందరగోళం. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపించవు,. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు కొత్త సమస్యలు తప్పవు. ఐటి నిపుణులకు ఒడిదుడుకులు తప్పకపోవచ్చు,. విద్యార్థులకు ఫలితాలు నిరాశపరుస్తాయి. మహిళలకు కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. షేర్ల విక్రయాలలో లాభాలు తధ్యం.
అదృష్ట రంగులు …లేత ఆకుపచ్చ, కాఫీ
రెమిడీ …సుబ్రమణ్యాష్టకం పఠించండి.

Today Horoscope
Today Horoscope

Today Horoscope: 6 – వృషభం – గురువారం – చైత్రమాసం

అభివృద్ధి సాధిస్తారు. దీర్ఘకాల సమస్యలు తీరతాయి. అప్తులు సహాయం అందిస్తారు. సంఘంలో మరింత కీర్తి పొందుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి శుభ వర్తమానాలు, ఆలయాలు సందర్శిస్తారు. భార్యభర్తల మధ్య వివాదాలు పరిష్కారం, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్లు, కాంట్రాక్టర్ లకు సంతోషకరమైన సమాచారం. వ్యాపారులకు నూతన పెట్టుబడులు, ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహం. ఐటిీ నిపుణులకు వివాదాల పరిష్కారం. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. మహిళలకు నూతనోత్సాహం.
అదృష్ట రంగులు ….తెలుపు, గులాబీ
రెమిడీ….సహస్ర నామ పారాయణ చేయండి

Today Horoscope: 6 – మిథునం – గురువారం – చైత్రమాసం

కొత్త వ్యక్తులు పరిచయం. శభ కార్యాలు నిర్వహిస్తారు, ఆకస్మిక ధనలాభం. చిన్న నాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. రియల్ ఎస్టేట్ల వారికి కొత్త ఆశలు. వ్యాపారాలలో మరింతగా లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు ఆశ్చర్యకరమైన సమాచారం. ఐటి నిపుణులకు మరింత అనుకూల సమయం. విద్యార్థులు ఫలితాలపై సంతృప్తి చెందుతారు. మహిళకు మానసిక ప్రశాంతత. షేర్ల విక్రయాలలో లాభాలు.
అదృష్ట రంగులు…ఆకుపచ్చ, తెలుపు
రెమిడీ..హనుమాన్ పూజలు మంచిది.

Today Horoscope: 6 – కర్కాటకం – గురువారం – చైత్రమాసం

ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ఎంతగా కష్టపడ్డా ఫలితం కనపించదు. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. బంధువర్గంతో విరోధాలు నెలకొంటాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. రియల్ ఎస్టేట్ల వారికి కొద్దిపాటి చిక్కులు, శారీరక రుగ్మతలు, వైద్య సేవలు. వ్యాపారాలు అంతగా కలసిరావు, ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు. పారిశ్రామిక వేత్తలకు లేనిపోని సమస్యలు. ఐటి నిపుణులకు ఒత్తిళ్లు తప్పవు. విద్యార్థులకు శ్రమాధికం. మహిళలకు గందరగోళంగా ఉంటుంది. షేర్ల విక్రయాలలో అనుకున్న లాభాలు కష్టమే.
అదృష్ట రంగులు …పసుపు, తెలుపు
రెమిడీ …సుబ్రమణ్యాష్టకం పఠించండి

Today Horoscope: 6 – సింహం – గురువారం – చైత్రమాసం

పనులు కొన్ని ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటా బయట వివాదాలు. ఆరోగ్యపరంగా చికాకులు పెరుగుతాయి. ఆథ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. భార్య భర్తల మధ్య వివాదాలు. కాంట్రాక్టర్లకు అవకాశాలు దూరం అవుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులలో పని భారం. పారిశ్రామిక వేత్తలకు నిరుత్సాహం. ఐటి నిపుణులకు వివాదాలు సమసిపోతాయి. విద్యార్థులకు శ్రమాధికం. మహిళలకు కుటుంబ సమస్యలతో మాట పట్టింపులు. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.
అదృష్ట రంగులు ….ఆకుపచ్చ, లేత ఎరుపు
రెమిడీ ….దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

Today Horoscope: 6 – కన్య- గురువారం – చైత్రమాసం

ఆర్థిక లావాదేవీలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి, కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాల నుండి గట్టెక్కుతారు. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ వారికి మరింత అనుకూల సమయం. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు మరింత ప్రోత్సాహం. పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు రాగలవు. ఐటి నిపుణులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. మహిళలకు కుటుంబంలో గౌరవం. షేర్ల విక్రయాలలో లాభాలు.
అదృష్ట రంగులు ….గోధుమ, ఎరుపు
రెమిడీ … శివాష్టకం పఠించండి.

Today Horoscope: 6 – తుల – గురువారం – చైత్రమాసం

బంధువులతో స్వల వివాదాలు. ప్రయాణాలలో అవాంతరాలు. శారీరక రుగ్మతలు, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. రియల్ ఎస్టేట్ల వారికి అంచనాలలో పొరపాట్లు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు లేనిపోని చికాకులు. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. మహిళలకు మానసిక ఆందోళన. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.
అదృష్ట రంగులు … లేత పసుపు, కాఫీ
రెమిడీ … సుబ్రమణ్యేశ్వరస్వామిని పూజించండి.

Today Horoscope: 6 – వృశ్చికం – గురువారం – చైత్రమాసం

ఉత్సాహంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల అభిమానం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ల వారికి శుభవర్తమానాలు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆకస్మిక పర్యటనలు. ఐటీ నిపుణులకు నూతన అవకాశాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలకు నూతనోత్సాహం. షేర్ల విక్రయాలలో లాభాలు.
అదృష్ట రంగులు. … గోధుమ, పసుపు.
రెమిడీ ..శ్రీ లక్ష్మీ స్తోత్రం పఠించండి.

Today Horoscope: 6 – ధనస్సు – గురువారం – చైత్రమాసం

ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కుటుంబంలో ఒత్తిడులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. నిరుద్యోగులకు కొంత గందరగోళం. దేవాలయాలు సందర్శిస్తారు. పనులలో ఆటంకాలు. దూర ప్రయాణాలు సంభవం.
రియల్ ఎస్టేట్లు, కాంట్రాక్టర్లకు సాదాసీదాగా ఉంటుంది. వ్యాపారులకు నిరుత్సాహమే. ఉద్యోగాలలో చిక్కులు. పారిశ్రామిక వేత్తలకు పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు పనిఒత్తిడులు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు రాక నిరాశ చెందుతారు.
మహిళలకు కుటుంబంలో చికాకులు. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.
అదృష్ట రంగులు. … కాఫీ, ఎరుపు.
రెమిడీ …ఆదిత్య హృదయం పఠించండి.

Today Horoscope: 6 – మకరం – గురువారం – చైత్రమాసం

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. చేపట్టిన కార్యక్రమాలలో పురోగతి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. బంధువులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి.
ఆభరణాలు, వాహనాలు కొంటారు. రియల్ ఎస్టేట్ల వారికి కోర్టు కేసుల పరిష్కారం. వ్యాపారాలలో లాభాలు తథ్యం.
ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. ఐటీ నిపుణులకు అరుదైన ఆహ్వానాలు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మహిళలకు కుటుంబంలో విశేష గౌరవం. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.
అదృష్ట రంగులు …. కాఫీ, గోధుమ.
రెమిడీ … శివ పంచాక్షరి పఠించండి.

Today Horoscope: 6 – కుంభం – గురువారం – చైత్రమాసం

నిరుద్యోగుల అంచనాలు నిజం చేసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
రియల్ ఎస్టేట్ల వారికి మరింత ప్రోత్సాహం. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి పిలుపు. ఐటీ నిపుణులకు కొత్త ఆశలు. విద్యార్థులకు పరిశోధనల్లో విజయాలు. మహిళలకు శుభ వార్తలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.
అదృష్ట రంగులు …. కాఫీ, ఆకుపచ్చ.
రెమిడీ.. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

Today Horoscope: 6 – మీనం – గురువారం – చైత్రమాసం

చేపట్టిన కార్యక్రమాలలో ప్రతిబంధకాలు. రుణ బాధలు తప్పవు. కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తుల విషయంలో బంధువులతో తగాదాలు. గృహం కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యం పై కొంత శ్రద్ధ చూపండి. దైవ దర్శనాలు చేసుకుంటారు. కాంట్రాక్టులు చేజారవచ్చు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు భాద్యతలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పర్యటనలు. ఐటీ నిపుణులకు లేనిపోని చికాకులు. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు మానసిక అశాంతి. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.
అదృష్ట రంగులు .. .ఆకుపచ్చ, గులాబీ.
రెమిడీ .. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

 

 

 

 

 

 

 


Share

Related posts

Today Horoscope సెప్టెంబర్ 5th శనివారం మీ రాశి ఫలాలు

Sree matha

Today Horoscope జనవరి -12- మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.

Sree matha

ఇతిహాసాలలో వేదాలలో ఏకాదశి వివరణ !

Sree matha