Today Horoscope: మే 7 – చైత్రమాసం – శుక్రవారం – రోజు వారీ రాశి ఫలాలు

Share

Today Horoscope: మేష రాశి – మే 7 – శుక్రవారం – చైత్రమాసం
వ్యయ ప్రయాసలు పడ్డా వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. రాబడి అంతంత మాత్రంగా ఉండి రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు సంభవం. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. కొన్ని విషయాలలో మానసికంగా కొంత ఆందోళన తప్పదు. ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించండి. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. కాంట్రాక్టులు ఊరిస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులలో అవాంతరాలు. ఉద్యోగులు స్థాన మార్పులు పొందుతారు. కళాకారులు నిరాశ తప్పదు.
అదృష్ట రంగులు .. .ఎరుపు, నేరేడు.
రెమిడీ … సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Today Horoscope
Today Horoscope

వృషభం

కొత్త కార్యక్రమాలతో ముందడుగు వేస్తారు. ఆర్థికంగా మరింత∙వెసులుబాటు కలుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. కీలక సమాచారం అందుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. కొన్ని వివాదాలు కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. పెట్టుబడులకు ఢోకా ఉండదు. ఉద్యోగస్తులు మీ హోదాలను నిలుపుకుంటారు. కళాకారులకు అనుకోని అవకాశాలు లభించవచ్చు. ఐటీ నిపుణులు సత్తా నిరూపించుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. మహిళలకు శుభవార్తలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.
అదృష్ట రంగులు … పసుపు, నేరేడు.
రెమిడీ ..గాయత్రీ ధ్యానం చేయండి.

మిథునం

సంఘంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ముఖ్య సమాచారం అంది ఊపిరి పీల్చుకుంటారు. బంధువుల సలహాలు, సూచనలు పొందుతారు. భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు ఊపందుకుంటాయి. కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. రియల్ ఎస్టేట్ల వారికి సంతోషదాయకమైన కాలం. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు. విద్యార్థుల యత్నాలు సఫలం. మహిళలకు ధన లబ్ధి. షేర్ల విక్రయాలలో లాభాలు.
అదృష్ట రంగులు .. .గులాబీ, తెలుపు.
రెమిడీ … హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం

సన్నిహితులతో అభిప్రాయబేధాలు. ప్రత్యర్థుల అంచనాలు అర్థంకాక సతమతమవుతారు. రాబడి అంతగా ఉండదు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులలో ఒత్తిడి పెరుగుతుంది. ఇంటర్వ్యూలలో నిరాశ,
వ్యాపారాలలో తొందరపాటు వల్ల కొద్దిపాటి నష్టాలు. ఉద్యోగాల్లో అదనపు పనిభారం. పారిశ్రామిక, కళారంగాల వారికి చికాకులు పెరుగుతాయి. ఐటీ రంగం వారి ఆశలు ఫలించవు. విద్యార్థులు మరింత శ్రమిస్తే ఫలితం కనిపిస్తుంది. మహిళలకు మానసిక ఆందోళన. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.
అదృష్ట రంగులు .. కాఫీ, తెలుపు.
రెమిడీ .. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం

ఇంటాబయటా ఒత్తిడులు అధికమవుతాయి. మిత్రులు, కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు. కష్టానికి తగ్గ ఫలితం దక్కదు.
దూర ప్రయాణాలు సంభవం. ఆరోగ్య పరిస్థితులు చికాకు పరుస్తాయి. రియల్ ఎస్టేట్ల వారికి కొత్త సమస్యలు. వ్యాపారాలలో భాగస్వాములతో విభేదాలు. ఉద్యోగులు పని భారం పెరిగి ఒత్తిళ్లకు లోనవుతారు. పారిశ్రామిక, కళారంగాల వారికి అవకాశాలు నిరుత్సాహం తప్పదు. ఐటీ నిపుణులు వివాదాలలో చిక్కుకుంటారు. విద్యార్థులకు ఒడిదుడుకులు.
మహిళలకు మానసిక అశాంతి. షేర్ల విక్రయాలు సాధారణంగా ఉంటాయి.
అదృష్ట రంగులు … ఎరుపు, లేత ఆకుపచ్చ.
రెమిడీ … శివాష్టకం పఠించండి.

కన్య

మీ ఆశయాలు నెరవేరతాయి. కీలకమైన నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. అత్యంత విలువైన వస్తువులు సేకరిస్తారు.
రాబడి అనూహ్యమైన రీతిలో పెరుగుతుంది. రుణాలు కొంత వరకూ తీరతాయి. కాంట్రాక్టులు లభిస్తాయి. కొత్త వ్యాపారాల ఆలోచనలు కలసి వస్తాయి. ఉద్యోగులకు కృషి ఫలిస్తుంది. పారిశ్రామికవేత్తలకు అరుదైన విషయాలు తెలుస్తాయి.
కళాకారులు కొత్త అవకాశాలతో ముందుకు సాగుతారు. ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం తెలుస్తుంది. విద్యార్థులకు ప్రోత్సాహం. మహిళలకు ఆస్తి లాభం. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.
అదృష్ట రంగులు … ఆకుపచ్చ, గులాబీ.
రెమిడీ .. హనుమాన్ ఛాలీసా పఠించండి.

తుల

నూతన పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు. ఆప్తులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు.
బంధువులతో చర్చలు సఫలం. ఉద్యోగ యత్నాలు సఫలం. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. కాంట్రాక్టర్లు కొన్ని దక్కించుకుంటారు. వ్యాపారాలలో అధిక లాభార్జన. ఉద్యోగులు ఉత్సాహంగా విధులు నిర్వహిస్తారు. కళాకారులు, రాజకీయవేత్తలకు సంతోషరకమైన వార్తలు. ఐటీ నిపుణులకు అదనపు బాధ్యతలు తొలగుతాయి. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.
అదృష్ట రంగులు … ఎరుపు, నేరేడు.
రెమిడీ … సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

వృశ్చికం

కుటుంబంలో చికాకులు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. సన్నిహితులతో అభిప్రాయబేధాలు. ఆకస్మిక ప్రయాణాలలో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా సాగక నిరాశ పరుస్తుంది. రాబడి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. పెట్టుబడుల వేటలో పడతారు.
ఉద్యోగాల్లో సమస్యలు కొద్దిపాటిగా తీరతాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. ఐటీ నిపుణులకు కొత్త హోదాలు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. మహిళలకు శుభవార్తలు. షేర్ల విక్రయాలలో లాభాలు.
అదృష్ట రంగులు .. .ఎరుపు, కాఫీ.
రెమిడీ .. దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి.

ధనుస్సు

ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. భూవివాదాలు, సోదరులతో విభేదాలు నెలకొంటాయి. ప్రత్యర్థుల నుంచి మరింత ఒత్తిడులు రావచ్చు. చేపట్టిన కార్యక్రమాల్లో అవాంతరాలు. దూర ప్రయాణాలు ఉంటాయి. బంధువులతో సంబంధ బాంధవ్యాలలో విఘాతం. కాంట్రాక్టులు అనుకూలించవు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయ, కళారంగాల వారికి కొత్త వివాదాలు. ఐటీ నిపుణులకు సమస్యలు పెరుగుతాయి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. మహిళలకు కుటుంబంలో చిక్కులు. షేర్ల విక్రయాలు మందగిస్తాయి.
అదృష్ట రంగులు .. పసుపు, ఎరుపు రంగులు.
రెమిడీ .. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

మకరం

కొత్త వ్యూహాలు అమలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషులు దగ్గరవుతారు. భూ వివాదాలు తీరి లాభం పొందుతారు. జీవిత భాగస్వామి సలహాలతో ముందుకు సాగుతారు. అప్రయత్న కార్యసిద్ధి.
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ల వారి యత్నాలలో కదలికలు. కొత్త వ్యాపారాలు విస్తరిస్తారు. అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులు పడ్డ శ్రమ, సేవలకు గుర్తింపు పొందుతారు. రాజకీయ, కళా రంగాల వారు ఉత్సాహంతో విజయాలు సాధిస్తారు. ఐటీ నిపుణులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మహిళలకు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి. మహిళలకు సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.
అదృష్ట రంగులు … నీలం, నలుపు.
రెమిడీ .. అంగారక స్తోత్రాలు పఠించండి.

కుంభం

రుణబాధలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సభ్యులతో వివాదాలు. ఆరోగ్య, ఆర్థిక సమస్యలు. ముఖ్యమైన కార్యక్రమాల లో ఒత్తిడులు. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రతిబంధకాలు.
రాజకీయ, కళారంగాల వారు ప్రతి విషయంలోను ఆలోచించి ముందుకు సాగాలి. ఐటీ నిపుణులకు తొందరపాటు నిర్ణయాలు తగదు. షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.
అదృష్ట రంగులు .. .గులాబీ, లేత ఆకుపచ్చ.
రెమిడీ .. శ్రీ కృష్ణాష్టకం పఠించండి.

Today Horoscope: మీనం

ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. దూర ప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. ప్రయత్నాలు ఫలించి ముందుకు సాగుతారు.
సేవాభావం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణాలలో కొంత ముందుకు సాగుతారు.
కుటుంబంలో సంతోషకరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ల వారికి పట్టింది బంగారమే. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి.
ఉద్యోగాల్లో లక్ష్యాలుసాధిస్తారు. పారిశ్రామిక, కళారంగాల వారికి ఒత్తిడులు తొలగుతాయి. ఐటీ నిపుణులకు చిక్కులు తప్పవు. విద్యార్థులు మరింత కష్టపడాల్సిన సమయం. మహిళలకు మానసిక అశాంతి. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.
అదృష్ట రంగులు.. లేత పసుపు, ఎరుపు.
రెమిడీ .. లక్ష్మీ దేవి స్తోత్రాలు పఠించండి.


Share

Related posts

సిగిరెట్లతో శివుడి పూజ .. ఇదేం దారుణం ?

Kumar

Daily Horoscope ఆగష్టు 24th సోమవారం మీ రాశి ఫలాలు

Sree matha

Today Horoscope: జూలై 3 – జ్యేష్ఠ మాసం – రోజు వారీ రాశిఫలాలు

somaraju sharma