Today Horoscope: మే 8- చైత్రమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Share

Today Horoscope: మేష రాశి – మే 8 – శనివారం – చైత్రమాసం

ఈరాశి వారికి వ్యవహారాలలో ప్రతిబంధకాలు. దూర ప్రయాణాలు ఉంటాయి. బంధువర్గంతో అకారణంగా విరోధాలు. రాబడి కొంత తగ్గవచ్చు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రియల్ ఎస్టేట్ల వారికి ఆటుపోట్లు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు అదనపు పనిభారం. ఐటీ నిపుణుల యత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. మహిళలకు కుటుంబసమస్యలు తప్పవు.
అదృష్ట రంగులు …గులాబీ,
రెమిడీ .. గోధుమ. విష్ణు ధ్యానం చేయండి.

Today Horoscope:
Today Horoscope:

వృషభం

నూతన విద్యావకాశాలు దక్కుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితులు సైతం అన్నింటా సహాయపడతారు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు. అదనపు ఆదాయం సమకూరుతుంది. రియల్ ఎస్టేట్ల వారికి ఆస్తిలబ్ధి. వ్యాపారులకు ఉత్సాహవంతమైన కాలం. ఉద్యగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయవేత్తలు, ఐటీ నిపుణులకు అనుకూల సమయం. విద్యార్థులకు అనుకూల సమాచారం.
మహిళలు శుభవార్తలు వింటారు.
అదృష్ట రంగులు….గులాబీ, కాఫీ.
రెమిడీ ..హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

మిథునం

వివాహ యత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు రాగలవు. పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. దేవాలయాలు సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్ల వారికి చిక్కులు తొలగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి.
ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లాభిస్తాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనూహ్యమైన అవకాశాలు. ఐటీ నిపుణులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. మహిళలకు గౌరవం పెరుగుతుంది.
అదృష్ట రంగులు… ఆకుపచ్చ, గోధుమ.
రెమిడీ .. గణపతిని పూజించండి.

కర్కాటకం

రుణ యత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు కొన్ని వాయిదా వేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది.
భూ వివాదాలు నెలకొంటాయి. సోదరులతో అకారణంగా విభేదాలు ఉంటాయి. ఉద్యోగులకు స్థాన మార్పులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులకు చికాకులు తప్పవు. మహిళలకు నిరుత్సాహం తప్పదు.
అదృష్ట రంగులు… తెలుపు, కాఫీ.
రెమిడీ ..దుర్గాదేవి స్తోత్రాల పఠనం మంచిది.

సింహం

ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆకష్టించినా ఫలితం కనిపించదు. బంధువులతో లేనిపోని వివాదాలు. దూర ప్రయాణాలు ఉండవచ్చు. రాబడి నిరాశ కలిగిస్తుంది. కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ల వారికి ఒత్తిడులు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో పనిభారం మరింతగా ఉంటుంది. ఐటీ నిపుణులు, పారిశ్రామికవేత్తలకు సామాన్యంగా ఉంటుంది.
విద్యార్థుల యత్నాలలో ఆటంకాలు. మహిళలకు మానసిక సంఘర్షణ.
అదృష్ట రంగులు…తెలుపు, లేత ఎరుపు.
రెమిడీ .. హనుమాన్ఛాలీసా పఠించండి.

కన్య

నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వివాహ యత్నాలు సానుకూలం. కాంట్రాక్టులు లభిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.
ఉద్యోగులు సమర్థతను నిరూపించుకుంటారు. రాజకీయవేత్తలు, కళాకారులకు మంచి గుర్తింపు రాగలదు. ఐటీ నిపుణులకు మరింత హోదాలు రాగలవు. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. మహిళలకు ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.
అదృష్ట రంగులు…లేత నీలం, పసుపు.
రెమిడీ ..లక్ష్మీనృసింహ స్తోత్రాలు పఠించండి.

తుల

కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. మాటలచాతుర్యంతో శత్రువులను సైతం ఆకట్టుకుంటారు.
చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆదాయం పెరిగి ఉత్సాహంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ల వారికి భూ లాభాలు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో హోదాలు సాధిస్తారు.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పురస్కారాలు. ఐటీ నిపుణులకు మరింత అనుకూల సమయం. మహిళలకు నూతనోత్సాహం.
అదృష్ట రంగులు…నీలం, నలుపు.
రెమిడీ ..విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం

ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. తీర్థ యాత్రలు చేస్తారు. అపరిచిత వ్యక్తుల నుంచి సమస్యలు ఎదురుకావచ్చు. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు. కాంట్రాక్టులు కొంత నిరాశపరుస్తాయి. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగాలలో ప్రమోషన్లు నిరుత్సాహపరుస్తాయి. పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులకు వివాదాలు. విద్యార్థులకు అవకాశాలలో మార్పులు. మహిళలకు నిరుత్సాహం.
అదృష్ట రంగులు…బంగారు, గోధుమ.
రెమిడీ ..దక్షిణామూర్తి స్తోత్రాిన రాశి ఫలం

ధనుస్సు

ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఇంటాబయటా సమస్యలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.
వివాదాలతో ఆప్తులు దూరమవుతారు. శారీరక రుగ్మతలు. కాంట్రాక్టర్లకు నిరుత్సాహం. వ్యాపారులకు గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. రాజకీయవేత్తలకు అంచనాలు తప్పుతాయి. ఐటీ నిపుణులకు లేనిపోని సమస్యలు. విద్యార్థులకు ఫలితాలపై నిరాశ. మహిళలకు మానసిక అశాంతి.
అదృష్ట రంగులు…ఎరుపు, బంగారు.
రెమిడీ ..గణేశాష్టకం పఠించండి.

మకరం

ఉత్సాహంగా పనులు చేపడతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. అందరిలోనూ మరింత గౌరవం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్లు, కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు. వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కుతాయి.
ఉద్యోగాల్లో ఉన్నతస్థితి. రాజకీయవేత్తలకు పదవీయోగం. ఐటీ నిపుణులు అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులకు ముఖ్య సందేశం అందుతుంది. మహిళలకు నూతనోత్సాహం.
అదృష్ట రంగులు…ఆకుపచ్చ, కాఫీ.
రెమిడీ..అంగారక స్తోత్రాలు పఠించండి.

కుంభం

కుటుంబ, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతారు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. అనుకోని ప్రయాణాలు సంభవం. పనులు ముందుకు సాగవు. బంధువులతో తగాదాలు. దేవాలయాలు సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్ల వారికి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడుల్లో నిదానం అవసరం. ఉద్యోగులకు స్థాన చలనం. రాజకీయవేత్తలు, కళాకారులకు ఒడిదుడుకులు. ఐటీ నిపుణులకు కొత్త సమస్యలు. మహిళలకు చికాకులు పరుస్తాయి.
అదృష్ట రంగులు…పసుపు, ఆకుపచ్చ.
రెమిడీ ..శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.

మీనం

సంఘంలో పరపతి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణ బాధలు తొలగుతాయి. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవకార్యాలలో పాల్గొంటారు.
రియల్ ఎస్టేట్ల వారికి ఆస్తిలాభ సూచనలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులు సేవలకు తగిన గుర్తింపు పొందుతారు.
పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం. ఐటీ నిపుణులకు అవకాశాలు మరింత పెరుగుతాయి.
మహిళలు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ముందడుగు వేస్తారు.
అదృష్ట రంగులు… గులాబీ, ఆకుపచ్చ.
రెమిడీ ..దేవి స్తోత్రాలు పఠించండి.


Share

Related posts

Today Horoscope డిసెంబర్ 27th ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు.

Sree matha

అయోధ్యలో చూడాల్సిన ప్రదేశాలు ఇవే !

Sree matha

Today Horoscope జనవరి -20- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.

Sree matha