Horoscope దైవం

Today Horoscope:  జూలై 23 – ఆషాడమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope
Share

Today Horoscope:  జూలై 23 – శుక్రవారం –  ఆషాడమాసం

మేషం

ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులకు చేయవలసి వస్తుంది.  దూరప్రయాణం సూచనలు ఉన్నవి.  దైవ సేవా కార్యక్రమాలలో  విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి.

Today Horoscope
Today Horoscope

వృషభం

కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో  అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు ఆర్ధిక వ్యవహారాలు  నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.

మిధునం

నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలగుతాయి.  వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం

మొండి బాకీలు వసూలు అవుతాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో  అధికారులను ఆకట్టుకొంటారు.  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

సింహం

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు దైవ సేవా కార్యక్రమాలకు ధన  వ్యయం  చేస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది ఉద్యోగార్థులకు కొంత అనుకూలత వాతావరణం ఉంటుంది.

కన్య

పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు  ఉండవు ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.  వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు  ఇస్తాయి.

తుల

నూతన కార్యక్రమాలు ప్రారంభించక  పోవడం మంచిది సోదర స్వల్ప వివాదాలు ఉంటాయి. ఇంటా బయట మీ మాటకు  విలువ తగ్గుతుంది. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి  వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

వృశ్చికం

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.  వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ  ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.

ధనస్సు

కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.  వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో  నూతన  లాభాలు అందుతాయి.

మకరం

వృత్తి ఉద్యోగాలలో  అధికారులతో సమస్యలు కలుగుతాయి. ధన  పరంగా ఒడిదుడుకులు అదికమౌతాయి  దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి  పెరుగుతుంది. దూర  ప్రయాణాలు వాయిదా పడతాయి.  దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన ఋణాలు చెయ్యకపోవడం మంచిది.

కుంభం

వృత్తి  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రాజకీయ వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన మార్పులు ఉంటాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు.

మీనం

వృత్తి ఉద్యోగాలలో శ్రమతో పనులు పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. వ్యాపారాల్లో నూతనప్రణాళికలు అమలుచేస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…


Share

Related posts

BJP : బీజేపీ కి అదిరిపోయే షాకిచ్చిన జ‌గ‌న్ ?

sridhar

చంద్రుని పదహారు కళల పేర్లు మీకు తెలుసా ?

Sree matha

వినాయకచవితి విశేషాలు ఇవే!

Sree matha