Today Horoscope: జూలై 24 – అషాడ మాసం – రోజావారీ రాశి ఫలాలు

Today Horoscope
Share

Today Horoscope: జూలై 24 – శనివారం – అషాడ మాసం

మేషం

ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. మిత్రుల నుండి శుభకార్యాలు ఆహ్వానలు అందుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు.

Today Horoscope:
Today Horoscope:

వృషభం

దూర ప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయాలు కలుగుతాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

మిధునం

విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.  వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలను అందుకుంటారు.

కర్కాటకం

దూర ప్రాంత బంధువులు నుండి వచ్చిన వార్తలు ఆశ్చర్యం కలిగిస్తాయి. తల్లిదండ్రుల నుంచి స్థిరస్తి లాభం పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

సింహం

నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో అవసరానికి మించి సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మండకోడీగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది కుటుంబ సమస్యలు కొంతవరకు తీరి ఊరట పొందారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధు మిత్రులు నుండి కొన్ని వినకూడని మాటలు వినవలసి వస్తుంది.  నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి బయటపడతారు.

తుల

ఆదాయానికి మించి ఖర్చులు ఉన్నప్పటికీ అవసరానికి ధనం చేతికి అందుతుంది కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు మండకోడిగా సాగుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన ఆలోచన చేయడం మంచిది. తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

వృశ్చికం

దైవ సంబంధిత కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు కలిసివస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి ఎదురైన ఆటంకాలను అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది.

ధనస్సు

గృహమున  శుభకర్యాలు నిర్వ హిస్తారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. దీర్ఘకాలిక రుణాలు నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక అనుకూలత పెరుగుతుంది  ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి.

మకరం

కుటుంబ సభ్యులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా పరిస్థితులు అనుకూలించక నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు. వాహన ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి బంధుమిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం

సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మానసికంగా శారీరకంగా ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

మీనం

పాత మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థ వంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన వాహన యోగం ఉన్నది.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

 


Share

Related posts

ఏ దేవుడికి ఏ దీపం పెట్టాలి?

Sree matha

ఇంద్రలోకంలోని అప్సరసల పేర్లు మీకు తెలుసా ?

Kumar

ఇతిహాసాలలో వేదాలలో ఏకాదశి వివరణ !

Sree matha